మనం తరచూ చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడుతూ ఉంటాము. అయితే ప్రతి సమస్యకూ వైద్యుడి దగ్గరికి పరిగెత్తే బదులు చిట్కా వైద్యంతో వీటిని ఎదుర్కోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి కొన్ని ఆయుర్వేద చిట్కాలను తెలుసుకుందాం.

 • చిటికెడు స్వచ్ఛమైన ఇంగువను అయిదారు చుక్కల నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిలో పెట్టి నొప్పిగా ఉన్న పంటి మీద పెడితే పంటి నొప్పి ఉపశమిస్తుంది.
 • కడుపుబ్బరం, గ్యాస్‌ట్రబుల్ కారణంగా త్రేన్పులతో బాధపడేవారు 100 గ్రాముల వామును సన్నని సెగ మీద ఎర్రగా వేయించి ఆరిన తర్వాత పొడిచేసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. త్రేన్పులు వచ్చినప్పుడు చెంచా పొడిని గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి లేదా పొడిని నేరుగా తీసుకుంటే వెంటనే త్రేన్పులు ఆగుతాయి.
 • యూరినరీ ఇన్‌ఫెక్షన్ కారణంగా మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించటం, చుక్కలు చుక్కలుగా రావటం వంటి ఇబ్బందులు సహజం. ఈ ఇబ్బంది ఉన్నవారు అర అంగుళం అల్లంముక్కను చెంచా తేనె లేదా చక్కెర తో కలిపి తింటే కలుపుకుని తింటే ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గి మూత్రం సాఫీగా వస్తుంది.
 • అరుగుదల లేక కడుపు నొప్పిగా ఉంటే చెంచా అల్లం రసం లేదా శొంఠి రసం తీసుకొని దానికి చెంచా చొప్పున తులసి రసం, తేనె తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
 • గుప్పెడు దానిమ్మ గింజలు చప్పరించి తింటే వేవిళ్ల వాంతులు మొదలు ఎలాంటి వాంతులైనా ఆగిపోతాయి.
 • నోటి దుర్వాసనతో బాధపడేవారు అరకప్పు నీళ్ళలో ఒక నిమ్మకాయ పిండి ఆ నీటితో నోరుపుక్కిలిస్తే నోటి దుర్వాసన ఉండదు.
 • పార్శ్వపు నొప్పి ఉన్నప్పుడు 4 చుక్కల తులసి రసాన్ని ఎడమవైపు నొప్పి ఉంటే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి ఉంటే ఎడమ ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే తప్పకుండా తగ్గుతుంది.
 • మలబద్ధకం బాధితులు రాత్రి పడుకోబోయే ముందు 5 గ్రాముల చొప్పున అల్లం, బెల్లం కలిపి తింటే సుఖ విరేచనం అవుతుంది.
 • కీళ్ళనొప్పులున్నవారు రెండుపూటలా 5 గ్రాముల చొప్పున ఉసిరి రసం, చక్కెర కలిపి తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
 • అధిక బరువు తగ్గాలంటే మూడుపూటలా ఒక్కో అశ్వగంధ ఆకు నమిలి తినాలి.
 • వదలని పొడి దగ్గు ఉన్నప్పుడు చెంచా చొప్పున తులసిరసం, తేనె కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం చేకూరుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE