• HOME
  • ఆరోగ్యం
  • చలికాలంలో గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు

ఇతర కాలాలతో పోల్చితే గర్భిణులు చలికాలంలో ఎక్కువగా  అనారోగ్యాల పాలవుతుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే చర్మ, శ్వాసకోశ  సమస్యలు, స్వైన్ ఫ్లూ వంటి వైరస్ లు,  ఇన్ఫెక్షన్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించకపోతే తల్లితో బాటు బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే గర్భిణులు ఈ దిగువ పేర్కొన్న జాగ్రత్తలు తప్పక పాటించాలి. అవి.. 

  • వేసవితో పోల్చితే చలికాలంలో మంచినీరు తాగటం తక్కువ గనుక గర్భిణులు సులభంగా డీహైడ్రేషన్‌ బారిన పడతారు. శరీరం ఫ్లూయిడ్స్‌ను కోల్పోయే కొద్దీ బిడ్డకూ పోషకాలు అందటం తగ్గుతుంది. అందుకే దాహం అనిపించే వరకు ఆగకుండా ప్రతి గంటకూ కాసినైనా నీళ్లు తాగాలి. నీరు ఎక్కువగా తాగనివారు కనీసం మజ్జిగ, కొబ్బరినీరు, బార్లీ వంటివి తాగితే ఈ ఇబ్బంది తలెత్తదు. 
  • చలిగాలి వల్ల చర్మం తేమను కోల్పోయి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పరిస్థితిని నివారించాలంటే ఈ సీజన్లో గర్భిణులు గాలి చొరబడని ఉన్ని దుస్తులు ధరించాలి.
  • ఈ సీజన్లో జలుబు మొదలు ఇన్ఫెక్షన్లు, స్వైన్ ఫ్లూ వంటి వైరస్ల ముప్పు ఎక్కువ. ఈ పరిస్థితిని నివారించేందుకు గర్భిణులు వ్యక్తిగత శుభ్రత మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మలమూత్ర విసర్జన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవటం, రోజూ స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించటం, చలిలో బయటకు వెళ్ళేటప్పుడు తలకు మెత్తని వస్త్రం చుట్టుకోవాలి. ఇన్‌ఫ్లుయెంజా నుంచి ముందస్తు రక్షణ కోసం గర్భిణీలు వాక్సినేషన్‌ చేయించుకుంటే మంచిది. 
  • గర్భిణులు రోజువారీ ఆహారంలో భాగంగా రోజూ పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలతో రోజూ 2 రకాల పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా సి-విటమిన్‌ అధికంగా లభించే ఉసిరి, జామ, కమలా, నారింజ, నిమ్మ ఫలాలను ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండటమే గాక చర్మం పొడిబారకుండా ఉంటుంది.
  • చలికాలంలో గర్భిణులు చిరుతిండిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రోజూ గుప్పెడు వేయించిన శెనగలు, వేరుశెనగ, బఠాణీ, డ్రై ఫ్రూట్స్ వంటివి తినటం వల్ల పోషకాహార లోపాలు నివారించబడతాయి. చక్కెరకు బదులుగా బెల్లం వాడాలి. 
  • గర్భిణులు రోజూ వాకింగ్, ప్రాణాయామం వంటి వ్యాయామాలను నిపుణులు సూచించిన రీతిగా సాధన చేయాలి. ఉదయం వేళ చలి వల్ల వాకింగ్‌ చేయలేకపోతే కనీసం సాయం సమయంలో వ్యాయామం చేయటం అవసరం. దీనివల్ల అధిక బరువు, మానసిక ఒత్తిడి, వంటి సమస్యలు దరిజేరవు. 
  • చలికాలంలో టీ, కాఫీల మీదికి మనసు పోవటం సహజమే. అయితే గర్భిణులు భోజనం తరువాత, టీ, కాఫీ తాగటం వల్ల శరీరానికి కావలసినంత ఐరన్ అందదు. అందుకే వీటికి బదులు సూప్, జావ వంటివి తాగటం మంచిది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE