జీర్ణాశయ సంబంధిత అనారోగ్యాల్లో ఐబీఎస్(ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్) ప్రధానమైనది. సాధారణ భాషలో దీన్ని ‘కడుపులో గడబిడ’  అని చెప్పొచ్చు. ఇది పేగుల  పనితీరులో వచ్చిన  మార్పు వలన కలిగే సమస్యే తప్ప నిర్మాణ సంబంధిత సమస్య కాదు. అంటే.. ఇది కేవలం సమస్య లక్షణమే తప్ప సమస్య కాదు. ఐబీఎస్ వల్ల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఇది రోజువారీ దినచర్యను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గణాంకాల ప్రకారం మనదేశంలో సుమారు 12 శాతం మంది దీని బాధితులే. తిన్న ఆహారం జీర్ణం కాకుండా విసర్జన కావటంతో శరీరానికి అందాల్సిన పోషకాలు అందక మనిషి బలహీనపడి పోతాడు. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి ఇతర అనారోగ్యాల బెడదా పెరుగుతుంది. అందుకే ఈ సమస్యను ముందుగా గుర్తించి తగు చికిత్స తీసుకోవటంతో బాటు జీవనశైలి మార్పులకూ సిద్ధపడాలి.

లక్షణాలు

 • కడుపుబ్బరం, కడుపులో గుడబెడ శబ్దాలు, త్రేన్పులు, తరుచూ వచ్చే అపాన వాయువు
 • రోజుల తరబడి విరేచనం కాకపోవటం లేదా తీవ్ర విరేచనం
 • ఆందోళన, భయం ఉన్నప్పుడు మరుగుదొడ్డికి పరుగులెత్తటం, మలంలో చీము
 • ఎప్పుడూ చిరాగ్గా ఉండటం, వికారం, వాంతి భావన
 • రుచి తెలియకపోవడం, ఛాతీలో మంట, పార్శ్వపు తలనొప్పి
 • స్త్రీలలో.. రుతుక్రమం దెబ్బతినటం,రతి నొప్పి, మూత్రం విసర్జనపైన అదుపు కోల్పోవటం
 • కొందరిలో కండరాల నొప్పులు, నిద్రలేమి, వెన్ను, పొట్టకింది భాగాల్లో నొప్పి

కారణాలు

 • మానసిక ఆందోళన, అసూయ, అతికోపం,
 • తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ తినటం
 • టీ, కాఫీలు అతిగా సేవించటం
 • వేళాపాళా లేని ఆహారం, నిద్ర
 • పెయిన్ కిల్లర్స్ అతి వినియోగం
 • అతిగా ప్రయాణాలు చేయటం, విరామం లేకుండా పనిచేయటం,
 • ఆహారంలో పీచు లోపించటం, కొవ్వు అతిగా ఉండే ఆహారం అతిగా తినటం,
 • జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్లు

పరీక్షలు

ఐబీఎస్‌కు ప్రత్యేక నిర్ధారణ పరీక్షలు లేవు. అయినా పై లక్షణాలు కనిపిస్తే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు ను వైద్యులను కలిసి సలహా కోరాలి. ఆవసరాన్ని బట్టి వారు సూచించే సిగ్మాయిడోస్కోపి, కొలనోస్కోపి, సిటి స్కాన్‌, రక్తపరీక్షలు, లాక్టోజ్‌ ఇన్‌టాలరెన్స్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు చేయించుకుంటే సమస్య నిర్ధారణ అవుతుంది. దీనివల్ల ఇతరత్రా జీర్ణకోశ సమస్యలున్నా ముందుగా తెలుసుకొనే అవకాశం ఉంటుంది.

నివారణ

వేళపట్టున తినటం, నిద్రించటం, తగినంత నీరు తాగటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, గోధుమ పొట్టు, మొక్కజొన్న పొట్టు, తౌడు వంటి పీచు అధికంగా లభించే ఆహారం తీసుకోవటం, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండటం, ధూమపానానికి స్వస్తి పలకటం వంటి జాగ్రత్తలు తీసుకొంటే సమస్య రాకుండా చూసుకోవచ్చు.  Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE