• HOME
  • ఆరోగ్యం
  • చెవి ఇన్ఫెక్షన్లకు సంపూర్ణ చికిత్స

పిల్లల్లో జలుబు తర్వాత ఎక్కువగా కనిపించే సమస్య చెవి ఇన్ఫెక్షన్. ఇది ముదిరే కొద్దీ చెవిపోటు, జ్వరం, చెవి నుంచి చీముకారటంగా మారే ప్రమాదం ఉంటుంది. చిన్న సమస్యేగా అని దీన్ని నిర్లక్ష్యం చేస్తే మధ్య, లోపలి చెవి దెబ్బతిని మూగ, చెవిటి వారిగా మారే ముప్పు పొంచి ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య బారిన పడిన చిన్నారులను వైద్యుడికి చూపించేందుకు బదులు పూజలు చేయించే అనాచారం కొనసాగటం దురదృష్టం. అందుకే ఈ సమస్య పట్ల తల్లిదండ్రులు తగు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.  

ప్రధాన కారణాలు

 జలుబు కారక వైరస్ లేదా బ్యాక్టీరియా ముక్కు మధ్యభాగానికి చేరి ఇన్ఫెక్షన్ గా మారతాయి. వీటి తీవ్రత ఎక్కువైన కేసుల్లో నెమ్మదిగా చెవిలోకీ పాకుతాయి. ముక్కు, చెవి రంధ్రాలు, చెవి నుంచి గొంతులోకి వెళ్లే యూస్టేషియన్ నాళాలు కలిసి ఉంటాయి గనుక ముక్కుకు వచ్చిన అలర్జీ, సైనస్ తరహా ఇన్ఫెక్షన్లు చెవిలో సైతం చేరి చీముకు కారణమవుతుంది. ఒక్కోసారి చీము పెరిగతం వల్ల కర్ణభేరికి రంధ్రం పడి చీము బయటకు రావచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రత, సోకి ఎంత కాలం అయింది? అనే పలు అంశాలను బట్టి సమస్య తీవ్రత ఆధారపడి ఉంటుంది. అపరిశుభ్రమైన నీళ్లలో ఈత కొట్టటం, చెవిలో పుల్లలు, ఇనుప వస్తువులు పెట్టి తిప్పటం వల్ల చెవిలో గాయం కావటం, ఏదైనా వస్తువు చెవిలో ఇరుక్కుపోవడం, అకస్మాత్తుగా వినిపించే భారీ శబ్దాల వల్ల చెవి లోపలి పోర దెబ్బతినటం వంటివన్నీ సమస్యకు దారితీయవచ్చు. 

సహజ రక్షణ.. గులిమి          

చెవిలో పిన్నులు, పుల్లలు, ఇయర్‌బడ్స్ పెట్టి తిప్పుతూ గులిమి తీసే అలవాటు ఉన్నవారికి చెవి సమస్యల బెడద ఎక్కువ. ఈ అలవాటు వల్ల చెవిలో గులిమి ఉత్పత్తి ఎక్కువై అది చెవి రంద్రం పూడిపోయేలా చేస్తుంది. నిజానికి చెవి తనలోని ఈ తరహా వ్యర్ధాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంది. ఇంకా చెప్పాలంటే.. చెవిలోకి క్రిములు, కీటకాలు వెళ్లకుండా శరీరం చేసుకొన్న ఏర్పాటే గులిమి. కనుక దీన్ని తీయాల్సిన అవసరం లేదని గ్రహించాలి. 

ఇన్ఫెక్షన్ లక్షణాలు

ఒక చెవి లేదా రెండు చెవులలో చీము కారటం

ఈ చీము నీరునీరుగా ఉండటంతో బాటు దుర్వాసనగా ఉండటం

జలుబు చేసినపుడు చీము ఎక్కవ కావటం

చెవినొప్పి, పోటు, జ్వరం ఉండటం

 

పరీక్షలు

 చెవి సమస్యలున్నప్పుడు ఈఎన్‌టీ వైద్యులు, ఆడియాలజిస్టులను సంప్రదించాలి. ఓటోస్కోప్ అనే పరికరం సాయంతో కర్ణభేరికి ఏదైనా రంధ్రం పడిందా? చెవిలో ఇన్ఫెక్షన్ ఉందా? గులిమి చేరిందా? తదితర అంశాలను తెలుసుకుంటారు. దీనితో పాటు వినికిడి పరీక్షలు చేసి చెవికి సంబంధించిన లోపాలను గుర్తిస్తారు. సమస్య తీవ్రతను బట్టి కొన్ని రక్తపరీక్షలు, సీటీస్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.

చికిత్స

చెవి సమస్య ఏదైనా తొలిదశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకోవాలి. దీనివల్ల యాంటీబయాటిక్స్ లేదా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులతోనే సమస్య దారికొస్తుంది. సమస్య అప్పటికే ముదిరితే చిన్న శస్త్రచికిత్సతో లోపలి ఇన్ఫెక్షన్‌ను తొలగించి కర్ణభేరికి పడిన రంధ్రాన్ని పూడ్చవచ్చు. తగు పరీక్షలు చేసిన తర్వాత సమస్యకు గల కారణాన్ని వైద్యులు నిర్ధారించి, చికిత్స చేస్తారు. 

జాగ్రత్తలు

స్నానం తర్వాత పొడి బట్టతో చెవులను తుడుచుకోవటం,, స్నానం సమయంలో చెవిలో దూదిపెట్టటం

మురికి నీటిలో ఈదనివ్వకుండా చూసుకోవటం 

సైనస్ ఉంటే చికిత్స తీసుకోవటం,

చెవిలో ఆకు పసరు, నూనె వంటివి పోయకుండా ఉండటంRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE