వేసవిలో దప్పికగా ఉన్నప్పుడు మనసు శీతల పానీయాల మీదికి పోవటం సహజమే. తాగిన వెంటనే దప్పిక తీరినట్లుండటం , ఆకట్టుకొనే రుచి, పలు వాణిజ్య ప్రకటనల ప్రభావం  కారణంగానే ఇప్పటిరోజుల్లో సీజన్ తో నిమిత్తం లేకుండా శీతలపానీయాలు తాగే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. వీరిలో మెజారిటీ పిల్లలు, యువతే. అయితే అపరిమితంగా శీతల పానీయాలు తాగితే దంతాలు దెబ్బతింటాయనీ, వయసు పెరిగే కొద్దీ ఆ ప్రభావం పలు ఇబ్బందులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతలపానీయాల వినియోగంతో వచ్చే పలు దంత సమస్యల వివరాలను తెలుసుకుందాం. 

పళ్ళపై కూల్‌డ్రింక్స్ ప్రభావం 

కూల్‌డ్రింక్స్ తాగినప్పుడు దంతాలు తమ సహజసిద్ధమైన సున్నితత్వాన్ని కోల్పోయి బిరుసెక్కుతాయి. ఈ సమయంలో కింది దంతాల మీద పై దంతాలు పెట్టి కదిలిస్తే గరగరమనే శబ్దం వస్తుంది. శీతల పానీయాల్లోని సిట్రిక్ ఆమ్లం ధాటికి దంతాల మీద ఉండే ఎనామిల్ పొర ప్రభావితం కావటం వల్లే పై మార్పు సంభవిస్తుంది. తరచూ శీతల పానీయాలు తాగేవారిలో ఈ పొరకు రంధ్రాలు ఏర్పడి ఎనామిల్ పొర పూర్తిగా కరిగిపోతుంది. అప్పటికైనా శీతల పానీయాలు తాగటం మానకపోతే దంతపు లోపలి పొర ‘డెంటిన్’ బయటపడుతుంది. 

ఈ దశలో చల్లని లేదా వెచ్చని పదార్థాలు తిన్నా లేక తీపి తిన్నా పంటినొప్పి రావటం, దంతాలు జివ్వున లాగటం జరుగుతుంది. ఈ పరిస్థితి దంతాలు పుచ్ఛి చివరకు నీరు కూడా తాగలేని స్థితికి దారితీస్తుంది. కొందరు గంటగంటకూ కొద్దిగా కూల్‌డ్రింక్ తాగితే సమస్య ఉండదని భావిస్తారు. అయితే దీనివల్ల రోజంతా వాటిలోని సిట్రిక్ ఆమ్లం దంతాల మీద నిలిచి దంతాల మీది ఎనామిల్ మరింత త్వరగా కరిగి దంతాలు పసుపుపచ్చగా తయారవుతాయి. ఇలాంటివారిలో దంతాల మీద బ్యాక్టీరియా చేరి దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ళ వాపు వంటి సమస్యలూ రావచ్చు.

ఇలాచేస్తే సరి

అతిగా కూల్‌డ్రింక్స్ తాగటం వల్ల పలు దంత సమస్యలు తప్పవు. అయితే వీటిని నేరుగా నోటిలో పోసుకొని తాగటం కంటే స్ట్రా ఉపయోగించి తాగటం వల్ల కొంతవరకు దంతక్షయాన్ని నివారించవచ్చు. అదే.. నేరుగా  బాటిల్‌తో తాగటంవల్ల దంతాలు కూల్‌డ్రింక్స్ లో పూర్తిగా మునిగి అందులోని సిట్రిక్ ఆమ్ల ప్రభావం చేత దంతాల పై భాగం మెత్తబడి వేగంగా అరిగిపోతాయి.

 జాగ్రత్తలు 

  • కూల్‌డ్రింక్ తాగినప్పుడు నీటితో నోరు పుక్కిలించి ఉమ్మాలి. దీని వల్ల కూల్‌డ్రింక్‌లోని సిట్రిక్ ఆమ్లం ప్రభావం తగ్గిపోతుంది.
  • దంతాలు జివ్వున లాగితే పొటాషియం నైట్రేట్ పేస్టుతో బ్రష్ చేయటంతో బాటు అదే పేస్టుతో చిగుళ్ళు, దంతాలను వేలితో రుద్దాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE