ఈ వేసవి తొలినాళ్లలోనే భానుడు విశ్వరూపాన్ని చూపుతున్నాడు. ఉదయం పట్టుమని 10 కాకముందే మండుతున్న ఎండకు జనం రోడ్డెక్కేందుకు జంకుతున్నారు. దీనికితోడు ఈ ఏటి వేసవి నిప్పుల కొలిమి కానుందని వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారంతో జనం బేజారైపోతున్నారు. మండే ఎండ, సతమతం చేసే ఉక్కపోతల నుంచి జనం అప్రమత్తంగా ఉండాలనీ, పిల్లల, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తత అవసరమనీ నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో ఆరోగ్య సంరక్షణకు వారు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు మీకోసం.. 

 • దాహం అయ్యేవరకు వేచివుండక ఎప్పటికప్పుడు తగినన్ని నీళ్లు తాగుతుండాలి. రోజుకు కనీసం 4 లీటర్లకు తగ్గకుండా చల్లని నీరు తాగాలి. కొత్త కుండ నీరైతే మరీ మంచిది. వేసవిలో బాగా శుద్ధిచేసిన నీటిని మాత్రమే తాగాలి. చెరువులు, కుంటల్లోని నీటిని తగిన విధంగా శుద్దిచేసుకొన్న తర్వాతే వాడాలి.
 • వేసవిలో శీతలపానీయాల జోలికిపోవద్దు. నిజానికి ఇవి తాగిన కొద్దిసమయం పాటు దప్పిక తీరినట్లు ఉంటుంది గానీ ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ దాహం వేస్తుంది. ఆరోగ్యానికి అంత మంచివికాని శీతల పానీయాలు తాగే బదులు ఇంట్లో చేసుకొనే పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, సబ్జాగింజల నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు తాగితే దప్పిక తీరటంతో బాటు తగినన్ని పోషకాలూ అందుతాయి.
 • వేసవిలో టీ, కాఫీ లు తాగటం, పొగతాగటం వీలున్న మేరకు తగ్గించుకోవాలి. ఎండవేళ మద్యపానం మరింత ప్రమాదమని గుర్తుంచుకోవాలి.
 • వేసవి కాలంలో ఫాస్ట్ ఫుడ్ స్థానంలో తాటిముంజలు, పుచ్చకాయ ముక్కలు, లేత కొబ్బరి, మజ్జిగ కలిపిన రాగిజావ వంటివి తీసుకోవాలి.
 • వేసవిలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు గల శాకాహారాన్ని తీసుకోవటం మంచిది. అతిగా మసాలాలు వాడొద్దు.
 • వేసవి మధ్యాహ్న సమయంలో వడగాలి, ఎండ అధికంగా ఉంటుంది. ఈ ఎండలో చర్మసమస్యలకు కారణమయ్యే అతినీలలోహిత కిరణాల(యూవీ రేస్ ) తీవ్రత చాలా ఎక్కువ. అందుకే ఈ వేసవిలో ఏదైనా పనులుంటే ఉదయం, సాయంత్రం పూట చూసుకోవాలి.
 • తప్పనిపరిస్థితిలో మధ్యాహ్నం బయటకి వెళ్లాల్సివస్తే చెవులతో సహా తలకు వస్త్రాన్ని చుట్టుకోవటం లేదా హెల్మెట్ ధరించటం చేయాలి. నడిచి వెళ్లేవారు తెల్లని గొడుగు వాడితే ఎండదెబ్బ తప్పించుకోవచ్చు.
 • వేసవిలో మెత్తని, నూలు దుస్తులు వాడటం వల్ల తక్కువ చెమట పట్టటం తగ్గటమే గాక ఆ చెమటను దుస్తులు వెంటనే పీల్చుకొంటాయి. ఈ దుస్తులు మరీ బిగుతుగా లేక వదులుగా ఉండేలా చూసుకోవాలి.
 • ఎండలో బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా ముఖం, మీద, చేతులకు సన్‌స్క్రీన్ లోషన్స్ వాడాలి. ఒకవేళ ఎండలో 3 గంటలకంటే ఎక్కువ సమయం ఉండాల్సివస్తే మరోసారి తప్పక రాయాలి.
 • బైకు, స్కూటర్ మీద ఎండలో బయటికి వెళ్లే సమయంలో ముఖానికి రుమాలు కట్టుకొని, సన్ గ్లాసులు పెట్టుకొంటే ఎండ చూపే ప్రతికూల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
 • పిల్లలకు ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 7 తర్వాత చన్నీటితో స్నానం చేయించాలి. పిల్లలకు తగిన విరామం ఇస్తూ తప్పనిసరిగా తల్లి పాలు పట్టించాలి. పిల్లలను వీలున్న మేరకు ఎండలో తీసుకుపోవద్దు. స్నానానికి సబ్బుల కంటే సున్నిపిండి వాడితే చెమట, మురికి వదిలిపోయి చెప్పలేనంత ఉపశమనం కలుగుతుంది.
 • వేసవి సెలవులు గనుక పిల్లలు ఆటపాటల్లో పడి ఎండను లెక్క చేయరు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ క్రికెట్ ఆడటం, సైకిల్స్ మీద తిరగటం వంటివి చేస్తారు. అందుకే పెద్దలు పిల్లలకు నచ్చజెప్పి మధ్యాహ్నం చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ కి పరిమితం చేయాలి.   
 • ఇంటిలో చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఇంటిపై కప్పుపై కూలింగ్ సున్నం పూయిస్తే కప్పు ఎక్కువగా వేడెక్కదు. బయటి గోడలకు తెల్లని లేదా లేత రంగులు వేసుకొంటే మంచిది.
 • మధ్యాహ్నం వడగాలి నేరుగా ఇంట్లోకి రాకుండా కిటికీలు మూసి ఉంచటంతో బాటు లోపలి వేడి గాలి బయటకి వెళ్లేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వంటివి అమర్చుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE