• HOME
  • ఆరోగ్యం
  • పొగ మానేశారు సరే.. మరి బరువు సంగతేంటి?

పొగ తాగటం మానేయటం ఆహ్వానించాల్సిన పరిణామమే. అయితే.. ఈ నిర్ణయం మూలంగా ఇతర సమస్యలు రాకుండా చూసుకోవటమూ అవసరమే. ముఖ్యంగా పొగ మానేసిన వారు తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను సకాలంలో గుర్తించలేక పోవటంతో కొందరిలో ఇది ఊబకాయానికి దారితీస్తోంది. అందుకే పొగ మానేసిన వారు కొన్ని ప్రత్యేక ఆహారపుటలవాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 

  • పొగతాగటం మానేసిన కొత్తల్లో కూరగాయల రసం, గోరువెచ్చని నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, గ్రీన్ టీ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరంలోని నికొటిన్ వ్యర్ధాలు త్వరగా వదిలిపోవటమే గాక హానికారక ఫ్రీ రాడికల్స్ కూడా అదుపులోకి వస్తాయి.
  • ఫాస్ట్ ఫుడ్, నిలవ చేసిన ఆహారం వంటి వాటికి స్వస్తి చెప్పి వాటికి బదులుగా పండ్లు, కూరగాయలు, మొలకలు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, లేత కోడి, చేప మాంసం తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది.
  • పొగ మానేసిన వారు పీచు అధికంగా ఉండే వేయించిన శెనగలు, శాండ్విచ్, పచ్చి క్యారెట్, కీరదోస వంటివి తింటే మితిమీరిన ఆకలి కాకుండా ఉండటమే గాక మనసు పొగతాగటం మీదికి పోకుండా ఉంటుంది.
  • దాల్చిన చెక్క, అల్లం, వాము ఆకు వంటివి కొద్దికొద్దిగా చప్పరించటం, వెన్న తీసిన పాల వినియోగం వల్ల మనసు తిరిగి పొగమీదికి పోదని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఖాళీగా ఉన్న సమయంలో పాప్ కార్న్, ఆపిల్, రేగు వంటి పండ్లు తింటుంటే బరువు సమస్య కూడా అదుపులో ఉంటుంది.
  • పొగతాగటం మానేసిన కొద్దిరోజుల్లోనే గాడితప్పిన జీవక్రియలన్నీ క్రమంగా గాడిన పడతాయి. ఈ సమయంలో తేలికపాటి వ్యాయామం చేస్తే డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ విడుదలై ఒత్తిడి దూరమవుతుంది. దీనితోబాటు రోజూ కాసేపు సైకిల్ తొక్కటం, డాన్స్, మెట్లు ఎక్కటం, టెన్నిస్ ఆడటం వంటి వ్యాపకాలు సైతం ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.
  • ధూమపానం, మద్యపానం రెండూ పరస్పర ప్రేరకాలు గనుక పొగ మానేసిన వారు మద్యపానానికి కూడా వీడ్కోలు చెప్పటం మంచిది. లేకుంటే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే టీ, కాఫీల వినియోగాన్ని కూడా తగ్గించుకోవాలి.
  • పొగ మానేసిన వారు ప్రతి 10 రోజులకోసారి బరువు చూసుకోవటం అవసరం. దీనివల్ల అదనపు బరువు ఉంటే అవసరమైన ఆహార, జీవనశైలి మార్పులు చేసుకోవచ్చు.
  • ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా నికొటిన్ మన ప్రయత్నాన్ని దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సంగీతం, యోగా, ధ్యానం, మసాజ్ వంటివి ఉపయోగపడతాయి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE