రోజూ కడుపులో నొప్పితో బాధపడుతున్నారా? మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమేనా? అయితే ఆ నొప్పి అమీబియాసిస్ వల్ల కావచ్చు. తాగునీరు, ఆహారం పట్ల అశ్రద్ధ, రోడ్డు మీద అమ్మే రెడీమేడ్ ఆహార పదార్థాలపట్ల మోజు, విందు భోజనాల తాకిడి ఎక్కువకావటం వంటివన్నీ అమీబియాసిస్ కి కారణాలు. దీనికితోడు భోజనంలో పెరుగు, మజ్జిగల్ని తీసుకోకపోవటం, ఫ్రిజ్ లో పెట్టిన పెరుగు తినటంతో మేలుచేసే బాక్టీరియా కడుపులోకి చేరక అమీబియాసిస్ అదుపులోకి రావటం కష్టంగా మారుతోంది. కారణాలు ఏమైనా ఈ సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా దీనికి తక్షణ చికిత్స తీసుకోవాలి. 

క్రిమికారక వ్యాధి

 'ఎంటమీబా హిస్టలిటికా' అనే క్రిమి వల్ల అమీబియాసిస్ సంక్రమిస్తుంది. తాగునీటి కాలుష్యం, పూర్తిగా ఉడకని ఆహారం, పాడైన ఆహారం ద్వారా ఇది మనిషి జీర్ణాశయంలోకి, ఆ తర్వాత పెద్దప్రేవుల్లోకి చేరుతుంది. ఆ తర్వాత ఇది మలం ద్వారా వెలువడి సమీపంలోని నీటిలో లేదా బురదలో చేరి ఆ నీటిని తాగినవారికి కూడా సంక్రమిస్తుంది. తొలిరోజుల్లో క్రిములు ఉన్న వ్యక్తి (కేరియర్)లో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు గానీ రెండు వారాలనుంచి రెండు నెలల లోపు ఇవి బయటపడతాయి. క్రిములు ప్రేవుల్లో ఉంటే దాన్ని ఇంటెస్టినల్‌ అమీబియాసిస్‌ అనీ, ఇతర భాగాల్లో ఉన్నప్పుడు ఎక్స్‌ట్రా ఇంటెస్టినల్‌ అమీబియాసిస్‌ అనీ అంటారు. 

లక్షణాలు

ఇంటెస్టినల్‌ అమీబియాసిస్‌ బాధితుల్లో రోజూ పలుమార్లు నీళ్ల విరేచనాలు అవుతాయి. ఇవి జిగురుగా, వాసనతో కూడి ఉంటాయి. కొందరిలో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, దీర్ఘ కాలం నీరసం, బరువు కోల్పోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు కొన్ని రోజులు లేదా వారాలు కనబడి ఆ తర్వాత మలబద్ధకం ఉంటుంది. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే పెద్ద ప్రేవుల్లో అల్సర్లు ఏర్పడి, మందంగా మారతాయి.

అమీబియాసిస్‌ తీవ్రరూపం దాల్చితే రక్తం, జిగురులతో కూడిన దుర్వాసన గల ద్రవరూప విరేచనాలు పలుమార్లు అవుతాయి. ఈ సమయంలో కడుపునొప్పి, మలద్వారం వద్ద నొప్పి, వాంతులు, కాలేయం పెరగటం జరుగుతుంది. ఈ దశలో ప్రేవులు చిల్లులు పడి లోలోపల రక్తస్రావం జరగటం, తీవ్రమైన జ్వరం వస్తుంది. క్రిములు కాలేయానికి సోకినప్పుడు హెపాటిక్‌ అమీబియాసిస్‌ అంటారు. కాలేయం పెరిగి నొప్పిగా ఉండటంతో బాటు జ్వరం, దగ్గుతోపాటు ఆకలి లేకపోవడం, చెమటలు పట్టటం, కుడిభుజంలో నొప్పి ఉంటాయి .

పరీక్షలు, చికిత్స

ఈ వ్యాధి నిర్ధారణకు మలపరీక్ష, ఎక్స్‌రే, సిగ్మాయిడోస్కోపి ఉపకరిస్తాయి. హెపాటిక్‌ అమీబిక్‌ లివర్‌ ఆబ్సెస్‌ను ఎక్స్‌రే, స్కాన్ ద్వారా చీమును ఆస్పిరేట్‌ చేసి పరీక్షించడం ద్వారానూ నిర్ధారిస్తారు. పూర్తిగా ఉడికిన ఆహారం తీసుకోవటం, పరిశుభ్రమైన నీరు తాగటం, మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించటం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE