చిన్నారులకు కంటి సమస్య ఎదురైతే స్ఫష్టమైన లక్షణాలుంటేనో లేదా సమస్య గురించి పిల్లలు చెబితేనే దాన్ని గుర్తించగలం. కారణాలు ఏవైనా.. చిన్నారుల నేత్ర సమస్యల్ని సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే.. ఆ సమస్యలు జీవితాంతం వేధించే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ఈ సమస్య కారణంగా చిన్నారు చూపు సైతం పోయే ముప్పు పొంచి ఉంటుంది. జ్ఞానేంద్రియాలలో కీలమైన కంటికి సంబంధించిన చాలా ప్రక్రియలు ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకు జరుగుతుంటాయి. అందుకే ఈ లోపే చిన్నారుల్లో కనిపించే నేత్ర సమస్యలను గుర్తించి చికిత్స ఇప్పించాలి.

ప్రధాన సమస్యలు

  • సాధారణంగా పిల్లలు అడుగు లేదా అడుగున్నర దూరానికి మించి లేదా ముఖానికి దగ్గరగా పెట్టి చదవటం, టీవీ చూడటం చేస్తుంటే కంటిలో సమస్య ఉన్నట్లు భావించాలి. పిల్లల్లో.. ఎదురుగా ఉన్న వస్తువు స్పష్టంగా లేక మసకమసకగా ఉండటం, ఎక్కువసేపు చదివినప్పుడు కళ్లలోంచి నీరు కారడం, తలనొప్పి వంటి సాధారణ ఇబ్బందులు ఎదురవటం సహజం. వైద్యురాలు సూచించిన కళ్లజోడుతో వీటిని నివారించవచ్చు. దీనివల్ల ప్రాథమిక స్థాయిలో ఉన్న సమస్య తీవ్రతరం కాకుండాఆ చూసుకోవచ్చు.
  • కొందరు పిల్లలకు గిట్టని పదార్ధం కారణంగా (ఇంట్లోని దుమ్ము ధూళి, పుప్పొడి వంటివి) కళ్ళు ఎరుపెక్కటం , దురదపెట్టి నలుపుకోవాలనిపించటం, కనురెప్పల చివరల్లో దురద, కళ్లలో నీరు రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీన్నే వైద్య పరిభాషలో 'ఆక్యులార్ అలర్జీ' అంటారు.
  • కొందరు పిల్లలకు మెల్లకన్ను ఉంటుంది. సాధారణంగా కళ్ల చివరి ప్రతిబింబాలు రెండూ మెదడులో ఒకటిగానే కనిపిస్తేనే చూపు స్పష్టంగా ఉంటుంది. మెల్లకన్ను ఉన్నవారిలో కంటి నల్లగుడ్డు పక్కకు జరిగి ఉండటంతో వారి చూపులో స్పష్టత ఉండదు. మరోవైపు .. ఇప్పటికీ మెల్లకన్ను అదృష్టమనే ఉద్దేశంతో కొందరు పెద్దలు దీన్ని సమస్యగానే గుర్తించటంలేదు. ఈ అర్థంలేని భ్రమలను పక్కనబెట్టి మెల్లకన్నుకు తగు సర్జరీ చేయించాలి. కొందరిలో మెల్లకన్నుకు సరైన వయసులో చికిత్స జరగకపోతే అది ఆంబ్లోపియా అనే సమస్యగా మారి శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
  • కొందరు పిల్లలకు దగ్గరి లేదా దూరపు వస్తువులు కనిపించకపోవడం, రాత్రి లేదా పగటి వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు కనిపించకపోవడం, రంగులను గుర్తించలేకపోవడం, కంటిచూపు పరిధి (ఫీల్డ్ ఆఫ్ విజన్) తగ్గటం, కనుగుడ్లు అటూఇటూ వేగంగా కదలటం వంటి లక్షణాలుంటాయి. ఇలాంటప్పుడు తక్షణం కంటివైద్యుడిని సంప్రదించాలి.
  • వృద్ధుల్లో మాదిరిగా కొందరు పిల్లల్లో పుట్టుకతోనే కంటిపాప తెల్లగా ఉంటుంది. దీన్ని ల్యూకోకోరియా అంటారు. మరికొందరిలో కంటిలో గడ్డలు కూడా ఉండొచ్చు. అలాగే.. నెలలు నిండకముందే పుట్టిన రెండు కిలోల లోపు బరువున్న పిల్లల్లో రెటీనా దెబ్బతినే ప్రమాదమూ పొంచి ఉంటుంది. పై మూడు లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే కంటి వైద్యుడి సలహా కోరాల్సిందే.
  • విటమిన్-ఏ లోపం వల్ల నల్లగుడ్డు పక్కన తెల్లమచ్చలు ఏర్పడి, దాని మూలంగా కళ్లు పొడిబారటం, రాత్రిపూట కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే నల్లగుడ్డు దెబ్బతిని చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉంటుంది.

సత్వర చికిత్స ఎందుకంటే...

మనం కళ్లతో చూసే వేర్వేరు దృశ్యాలను ఒకటిగా చూడగల వ్యవస్థ మెదడులో ఉంటుంది. అయితే.. ఏదైనా కంటి నుంచి వచ్చే ప్రతిబింబ దృశ్యం అంత స్పష్టంగా లేనప్పుడు దాన్ని మెదడు స్వీకరించదు. దీనివల్ల బాగున్న కన్ను పంపే ప్రతిబింబాన్ని మాత్రమే మెదడు గుర్తించటం మొదలుపెడుతుంది. ఈ పరిస్థితిని వెంటనే గుర్తించి తగు చికిత్స చేయకపోతే.. తర్వాత ఆ ఆ కంటికి చికిత్స చేసినా మెదడు దాన్ని నిరాకరిస్తుంది. కాబట్టి కంటిసమస్య ఏదైనా.. దానికి సత్వర చికిత్స అందించాలి.

ఇలా చేయాలి

పెద్దలు తరచూ పిల్లల కళ్ళు పరీక్షించాలి. కళ్లలోని కనుగుడ్లు రెండూ ఒకేలా ఉన్నాయేమో గమనించాలి.

పెద్దలు.. ఏదైనా ఒక వస్తువును చూపించి దాన్ని లక్షణాలు పిల్లలను చెప్పమని అడగాలి. వస్తువు రెండుగా కనిపిస్తుందని పిల్లలు చెబితే దాన్ని సమస్యగా గుర్తించాలి. ఒక కంటితో స్పష్టంగానూ, మరో కంటితో మసకగా కనిపిస్తుందని చెప్పినా వెంటనే కంటివైద్య నిపుణులను సంప్రదించాలి.

చిన్నారుల్లో ఎలాంటి కంటి లోపాలు కనిపించకపోయినా స్కూల్లో చేర్పించే ముందు ఒకసారి కంటి నిపుణులకు చూపించాలి. ఆ తర్వాత ఐదేళ్ల వయసులో కూడా ఇలా చేయటం వల్ల సమస్యలను ముందుగా గుర్తించటం సాధ్యమవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE