వాతావరణం, కాలుష్యం వంటి కారణాలతో బాటు పలు వ్యక్తిగత అలవాట్ల మూలంగా కన్ను తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటుంది. ముఖ్యంగా రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ మీద పనిచేసేవారిలో ఇది మరింత ఎక్కువ. రోజువారీగా ఎదురయ్యే ఈ కంటిఒత్తిడిని అధిగమించాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 

  • కూర్చొని మాత్రమే పేపర్ లేదా పుస్తకం చదవాలి. చదివేటప్పుడు కంటికి, పుస్తకం మధ్య కనీసం 30 నుంచి 40 సెం. మీ. దూరం ఉండాలి. పడుకుని లేదా ఊగే కుర్చీలో కూర్చుని చదివినా కంటిమీద ఒత్తిడి పడక మానదు. చదివే చోట సరిపడా వెలుతురు ఉండాలి.
  • గంటలతరబడి టీవీ చూడటం వల్ల కళ్ళు ఒత్తిడికి గురవుతాయి గనుక గంటకు మించి టీవీ చూడరాదు. వెన్నెముకకి ఊతమందే రీతిలో ఉండే కుర్చీలో కూర్చుని టీవీ చూడటం, టీవీకి కూర్చొన్న చోటుకు కనీసం 3 మీటర్లు దూరం వుండాలి. పడుకొని టీవీ చూడరాదు. టీవీ ఉన్నగదిలో తగినంత వెలుతురూ ఉండాలి. టి.వి. వెనుక కాస్త ఎత్తులో లైటు అమర్చితే కంటి మీద ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడొచ్చు.
  • కంప్యూటర్ వాడేటప్పుడు తెర మధ్య భాగానికి పైన చూపు సారించాలి. కుర్చీలో కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. తెరవైపు ఎక్కువసేపు తీక్షణంగా చూడకుండా మాదేమధ్యలో కనురెప్ప కొట్టాలి. కంప్యూటర్ తెర మీద తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. తెరమీద యాంటీగ్లేర్ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవటం లేదా కాంతి ప్రభావాన్ని నిరోధించే కళ్ళజోడు వాడటం మంచిది. స్మార్ట్ ఫోన్ విషయంలోనూ ఈ జాగ్రత్తలు అవసరం.
  • పగటిపూట బైక్ నడిపేవారు సన్ గ్లాసెస్ వాడటం ద్వారా సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాల ముప్పును, కాలుష్యాన్ని తప్పించుకోవచ్చు. రాత్రి బైక్ నడిపేటప్పుడు యాంటీగ్లేర్ గ్లాస్ వాడితే ఎదుటి వాహనాల హెడ్ లైట్ కాంతి ప్రభావం కంటిమీద పడదు.

కంటికి ఉపశమనం కోసం..

  • తలను విశ్రాంతి స్థితిలో నిలిపి కళ్ళను గుండ్రంగా సవ్య, అపసవ్య దిశల్లో పలుమార్లు తిప్పాలి. అలాగే కళ్ళను కుడి కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిప్పాలి.
  • పని వేళల్లో ప్రతి గంటకోసారి కుర్చీలోంచి లేచి 5 నిమిషాలు బయట తిరుగుతూ అక్కడి పచ్చని చెట్ల వైపు దృష్టి సారించాలి.
  • ప్రతి గంటకోసారి చల్లని నీటితో కళ్ళను తడిపి తుడిస్తే కొంత ఉపశమనం లభిస్తుంది.
  • కంప్యూటర్ తెరమీద లేత రంగుల్లో మీకిష్టమైన ప్రకృతి దృశ్యాలను పెట్టుకొని వాటివైపు చూడటం వల్ల కొంత ఒత్తిడి తగ్గుతుంది.
  • పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు పనికి విరామం ఇచ్చి, కుర్చీలో విశ్రాంతి స్థితిలో కూర్చొని తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కూర్చొంటే కంటిమీది ఒత్తిడి కొంత తగ్గుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE