• HOME
  • ఆరోగ్యం
  • చేటులేని సౌందర్య చికిత్స... అల్ట్రాసానిక్ లైపోసక్షన్

            జీవన శైలి లోపాల వల్ల వచ్చే శారీరక సమస్యల్లో ఊబకాయం ఒకటి. తీరైన శరీరం తన ఆకృతిని కోల్పోయి ఉన్న చోటినుంచి కదలలేని దుస్థితికి కారణమయ్యే సమస్య ఇది. అన్ని వయసుల వారినీ ఇబ్బందిపెట్టే సమస్యే అయినా అందంగా కనిపించాలనుకొనే యువతకు మరింత పెద్ద సమస్య. గాడితప్పిన జీవనశైలి, అతిగా తినటం, శారీరక శ్రమకు దూరం కావటంతో బాటు జన్యుపరమైన అంశాలూ ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఒక్కోసారి ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడికీ కారణమవుతోంది. అయితే..ఇప్పుడు 'అల్ట్రాసానిక్ లైపోసక్షన్' వంటి ఆధునిక చికిత్స సాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. 

దశలు

తొలిదశ: ఈ చికిత్స కోరేవారికి ముందుగా బీసీఏ (బాడీ కంపోజిషన్ అనలైజర్) సాయంతో శరీరంలో పేరుకున్న కొవ్వు పరిమాణం, శరీరంలోని నీటి శాతం, కండరాల పరిస్థితి వంటి అంశాలను అంచనా వేస్తారు. అదే సమయంలో సదరు వ్యక్తికున్న అనారోగ్యాలు, గతంలో జరిగిన చికిత్సల వివరాలూ తెలుసుకొంటారు. అనంతరం కొవ్వు తొలగించుకోవాలనుకుంటున్న భాగాన్ని పరిశీలించి కొలతలు తీసుకొన్నతర్వాత చికిత్సకు సిఫారసు చేస్తారు. 

మలిదశ: కొవ్వు తొలగించాల్సిన భాగంపై అల్ట్రాసొనిక్ జెల్ రాసి లోపలి భాగంలో గల రక్త నాళాలు, నరాల కణజాలానికి హాని జరగని రీతిలో తక్కువ శక్తిగల అల్ట్రాసౌండ్ తరంగాలను అక్కడి కొవ్వుకణాల మీద ప్రసరింపజేస్తారు. దీంతో అక్కడి కొవ్వు శాశ్వతంగా తొలగిపోతుంది. ఒక్కో సిట్టింగ్ అరగంటపాటు, వారానికి రెండు సెషన్ల చొప్పున మూడు నుంచి 18 వారాలలో చికిత్స పూర్తవుతుంది. దీనిసాయంతో సుమారు 10నుంచి 15 కేజీల బరువు తగ్గించుకోవచ్చు. తొలగించు కొవ్వు ద్రవరూపంలో కాలేయం లోకి అక్కడ జీర్ణక్రియ పూర్తి చేసుకుని విసర్జన జరుపుకుంటుంది.

ఇతర అంశాలు

  • శరీరంలో నీటి శాతం ఎక్కువ ఉన్నప్పుడు చికిత్స తక్కువ సిట్టింగ్స్‌లో పూర్తవుతుంది. నొప్పి, తిరిగి కొవ్వు చేరటం ఉండదు. చికిత్స తర్వాత చర్మానికి సహజమైన నిగారింపు వస్తుంది.
  • నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నప్పుడే ప్రతికూల ప్రభావాలు ఉండవు. ఆశించిన ఫలితమూ దక్కుతుంది.
  • చికిత్స తర్వాత వైద్యుల సూచన ప్రకారం ఆహారం తీసుకొని తగినంత వ్యాయామం చేయాలి. లేకుంటే మళ్ళీ బరువు పెరుగుతారు. 

ప్రత్యేకతలు

  • శరీరంపై గాటు పెట్టనవసరం లేకుండా, రవ్వంత నొప్పి లేకుండా చేసే ఈ చికిత్సతో ఎలాంటి ప్రతికూల ప్రభావాలూ ఉండవు. దీనికి అనస్థీషియా సైతం పనిలేదు.
  • తొలగించిన కొవ్వు కణాలు ఆ ప్రాంతంలో మళ్లీ ఏర్పడవు.
  • ఈ చికిత్స తర్వాత ఎక్కువ విశ్రాంతి అవసరం లేదు. మరునాటినుంచే విధులకు హాజరుకావచ్చు.
  • దద్దుర్లు, చర్మం కందిపోవడం వంటి లక్షణాలు, ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం ఉండదు.
  • సుమారు 4 సిట్టింగ్స్ ముగిసేనాటికే స్పష్టమైన శారీరక మార్పులు కనపడతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE