ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మరణాలకు కారణమవుతున్న దురలవాట్లలో ధూమపానం మొదటిది. చాలామంది విషయంలో ఇది స్కూల్, కాలేజీ రోజుల్లో ఓ సరదా అలవాటుగా మొదలవుతుంది. ఆ తర్వాత అదే పూర్తి స్థాయి అలవాటుగా, మానలేని వ్యసనంగా పరిణమిస్తోంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ఏటికేడు కొత్తగా ఈ వ్యసనం బారిన పడేవారిసంఖ్య పెరుగుతూనే పోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే పలు అన్నరోగ్యాల కారణంగానైనా ధూమపానానికి స్వస్తి చెబుదామనుకునే వారూ అనుకున్నంతగా సఫలం కాలేకపోతున్నారని సంస్థ నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. అయితే ధూమపానానికి స్వస్తి చెప్పాలనే సంకల్పానికి నిర్ణీత ప్రణాళిక, జీవన శైలి మార్పులు కూడా తోడైతే పొగకు చెక్ పెట్టొచ్చని అపోలో టొబాకో సిజేషన్ క్లినిక్ వైద్యులు డా. సాయి ప్రవీణ్ హరనాథ్ చెబుతున్నారు. అదెలా సాధ్యమో తెలుసుకుందాం. 

గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యకు పలు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అత్యుత్తమ ఫలితాలనిస్తున్న విధానాలలో 5 A  ఫార్ములా ప్రధానమైనది. ఇందులో  Ask, Advise, Assess,Assist, Arrange అనే అయిదు సూత్రాలుంటాయి. ఈ  ప్రణాళికను అర్థం చేసుకుని, అమలు చేయగలిగితే ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ ఈ జాడ్యం నుంచి ఖచ్చితంగా బయట పడొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల ప్రసంశలు అందుకున్న ఈ ప్రణాళిక తొలి దశలో ' ఈ అలవాటును ఎందుకు మానుకోలేక పోతున్నాను?', 'అసలు ఈ అలవాటును ఎందుకు కొనసాగించాలి?' వంటి అంశాలు, రెండో దశలో ఈ అలవాటును  వదిలించుకునే మార్గాలేమిటి? తదితర అంశాలపై నిపుణులు కౌన్సెలింగ్ ఇస్తారు. మూడో దశలో ఈ జాడ్యం వాళ్ళ వచ్చే దుష్పరిణామాలను ఆయా వ్యక్తుల చేతనే అంచనా వేయించటం, చివరి దశలో సమస్య నుంచి బయటపడే ఆచరణ సాధ్యమైన సూచనలు చేస్తారు. మనో బలంతో సమస్యకు చెక్ పెట్టినా, తిరిగి మళ్ళీ దాని బారిన పడే అవకాశం ఉన్నందున, ఆ పరిస్థితిని నివారించే చిట్కాలనూ నిపుణులు సూచిస్తారు. అప్పటికే నికోటిన్ ప్రభావానికి లోనైనా, దానిని క్రమంగా తగ్గించుకుంటూ, పూర్తిగా దాని ప్రభావం నుంచి బయటపడే మార్గాలనూ కౌన్సెలింగ్ సమయంలో వివరిస్తారు. చాలా మంది సిగరెట్ తాగటానికి బదులుగా హుక్కా తాగొచ్చనే అపోహల్లో ఉంటారు. అలాంటి పలు అపోహలనూ ఈ క్లినిక్స్ దూరం చేస్తాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు క్లినిక్స్ వివరాలు, పునరావాస కేంద్రాలలో అమలు చేసే విధానాలను కూడా ఇక్కడ వివరిస్తారు. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి తీవ్రమైన శ్వాస కొస సమస్యల తీవ్రతను ధూమపానం ఎంతగా ప్రేరేపిస్తుందో కూడా వివరిస్తారు.

 

పొగకు చెప్పండిలా..

 • హటాత్తుగా సిగరెట్ మానుకోవాలనే నిర్ణయ తీసుకొని, ఇంట్లో వారికి, ఫ్రెండ్స్ కు చెప్పాలి. దీని వల్ల సామాజికంగా మీ మీద ఒత్తిడి ఉంది, మళ్ళీ దాని జోలికి పోకుండా చూసుకోవచ్చు.
 • అలవాటు మానుకున్న తొలినాళ్ళలో తీరిక లేనంత పని పెట్టుకోవటం పదే పదే సిగరెట్ మీదికి మనసు పోవటం తగ్గుతుంది.
 • సిగరెట్ బాక్స్, యాష్ ట్రే, లైటర్ వంటి వస్తువులను బయట పారేయండి .
 • సిగరెట్ మీదికి మనసు లాగినప్పుడల్లా చూయింగ్ గం వంటివి నమలాలి . నికోటిన్ ప్రభావాన్ని అధిగమించే పలు ఉత్పత్తులను ట్రై చేయండి.
 • మద్యం తీసుకున్నప్పుడు సిగరెట్ తాగొద్దు. మద్యం కూడా మానుకుంటే ఇంకా మంచిది.
 • బయట టిఫిన్, భోజనం తర్వాత, టీ, కాఫీలు తాగిన తర్వాత సిగరెట్ తాగే అలవాటున్న వారు డ్రై ఫ్రూట్స్  లేదా మీకిష్టమైన పండ్లు తేనే అలవాటు చేసుకోవాలి.
 • ఒక్కసారిగా అలవాటు మానుకున్న తొలి అయిదారు రోజులు చిరాగ్గా ఉండటం, మలబద్ధకం, తలనొప్పి వంటి చిన్న సమస్యలున్నా ఆయా ప్రత్యామ్నాల సాయంతో వాటిని అధిగమించొచ్చు.
 • మీతో కలిసి సిగరెట్ తాగే అలవాటున్న మిత్రులుంటే, ఒక నెల రోజులపాటు వారిని కలవటం వాయిదా వేసుకోండి .
 • మీరు రోజూ సిగరెట్ కాల్చే దుకాణాలు, హోటల్స్ వైపు కొన్నాళ్ళు వెళ్లొద్దు .
 • సిగరెట్ మానేయటం వల్ల మీ ఆరోగ్యం ఎంత మెరుగు పడిందో తలచుకోవటం వల్ల మళ్ళీ ఆ అలవాటు జోలికి పోకుండా ఉండటం సాధ్యపడుతుంది.
 • పేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో పొగాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్న పోస్ట్ లను లైక్ చేయండి.
 • ఎన్నో ఏళ్ళుగా ఉన్న అలవాటును వదిలించుకోవటంలో ఒకసారి, రెండు సార్లు విఫలమైనా నిరాశ చెందకుండా మళ్ళీ మళ్ళీ ప్రయతిస్తూనే ఉండాలి.

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE