చాక్లెట్ మాట వినగానే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నోట్లో నీళ్లూరాల్సిందే. ప్రేమికుల రోజు మొదలు పెళ్లి రోజు వేడుకల్లో ప్రేమ, అనురాగాలకు ప్రతీకైన చాక్లెట్ ఉండాల్సిందే. పశ్చిమదేశాల వారు దీన్ని దేవతా ఆహారంగా చెబుతారు. వేల ఏళ్ళ చరిత్ర గల చాక్లెట్ మానసిక, శారీరక ఆరోగ్యానికి  ఎంతగానో దోహదం చేస్తుంది. వీటిలో చక్కెర అధికంగా వాడే సాధారణ చాక్లెట్ల కంటే 60- 70 శాతం కోకోతో తయారైన నల్లని, కొద్దిగా చేదుగా, కోకో వాసనతో ఉండే చాక్లెట్లే (డార్క్ చాక్లెట్లు)   ఆరోగ్యానికి ఎక్కువగా మేలుచేస్తాయి.

చరిత్ర 

 కొకో గింజల పొడితో చేసే చాక్లెట్ ను ఒకప్పుడు డబ్బు స్థానంలో మారక ద్రవ్యంగా వాడేవారు. తొలిరోజుల్లో పానీయారూపంలో ఉండే చాక్లెట్ కేవలం రాజులు, సైన్యాధికారులు, పురోహితులు, వైద్యుల వంటి ఉన్నత వర్గాలకే అందుబాటులో ఉండేది. అయితే.. 16 వ శతాబ్దంలో మెక్సికో ప్రాంతంపై దాడికి వచ్చిన స్పెయిన్ పాలకులు వెళ్తూ కోకో గింజలు వెంటతీసుకొని పోయి ఆ గింజల పొడికి చక్కెరను చేర్చి వాడటం మొదలు పెట్టారు. మరో 100 ఏళ్లకు స్పెయిన్ యువరాణి ఫ్రాన్స్‌ వాసి ఎనిమిదో లూయిస్‌ను పెళ్లి చేసుకొని అత్తారింటికి వస్తూ చాక్లెట్లను తేవటంతో యూరోప్ అంతటా చాక్లెట్ విశేషాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వలసపాలనలో కోకో సాగు పెరగటం,19 వ శతాబ్దంలో కోకో పొడి చేసే యంత్రాలు  రావటంతో కొకో గింజల లభ్యత, శుద్ధి సులభమై చాక్లెట్ వినియోగం కూడా పెరుగుతూ వచ్చింది.

పోషకాల సమాహారం

100 గ్రా. చాక్లెట్ బార్‌లో 67శాతం ఐరన్, 58 శాతం మెగ్నీషియం, 89 శాతం కాపర్, 98 శాతం మాంగనీసూ 11 గ్రా. పీచుతో బాటు తగు మోతాదులో పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియంలూ, బి1, బి2, డి, ఇ విటమిన్లూ ఉంటాయి. 100 గ్రాముల బార్ తింటే  600 క్యాలరీలూ శరీరంలో చేరతాయి.  రోజూ 30 గ్రాములకు మించకుండా మాత్రమే చాక్లెట్ తినాలని నిపుణులు చెబుతున్నారు.  

ఉపయోగాలు

  • యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్లు తింటే అధిక రక్తపోటు, రక్తం అతిగా గట్టకట్టటం వంటి సమస్యలు రావు .
  • మస్తిష్కంలో మానసిక ఉద్వేగాలను నియంత్రించే సెరిటోనిన్ మరియూ డోపామైన్ అనే రసాయనాలను సమతుల్యంగా ఉంచటంలో చాక్లెట్ల వినియోగం దోహదపడుతుంది.
  • చాక్లెట్ల వినియోగంతో రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగి హృదయ సంబంధిత వ్యాధులు రావు.
  • రోజూ ఒకటి లేదా రెండు డార్క్ చాక్లెట్లను తింటే లోబీపీ దరిజేరదు. జీర్ణనాళాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నశించి జీర్ణకోశ వ్యాధుల ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుంది.
  • కకోవాలోని టానిన్లు దంతాలను త్వరగా పాచి పట్టనీయవు. ఇక.. చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది కేవలం అపోహ మాత్రమే.
  • గర్భిణుల్లో తొలి 4 నెలల్లో వచ్చే సమస్యల నివారణకు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి , వారు ఉల్లాసంగా ఉండేందుకు డార్క్‌ చాక్లెట్ వినియోగం దోహదపడుతుంది.    
  • మెరిసే, మృదువైన చర్మం కోరుకొనే వారు తప్పక చాక్లెట్లు తీసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE