మారిన జీవనశైలి, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వంటి కారణాల వల్ల రోజులో చాలా పనులకు శారీరక శ్రమ అవసరం లేకుండా పోయింది. ప్రతిపనికీ యంత్రాల సాయం పొందే వెసులు బాటు రావటంతో రోజులో ఎక్కువ సమయం కదలకుండా కూచోవటం అలవాటుగా మారుతోంది. నగర ప్రాంతాల్లో మెలకువగా ఉన్న సమయంలో 90 శాతం సమయాన్ని కూర్చొనే గడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజులో ఎక్కువ సమయం కూర్చొనేవారికి పలు రకాల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ క్రమం తప్పక వ్యాయామం చేసేవారికీ ఈ ఇబ్బంది తప్పదని వారు సూచిస్తున్నారు. ఒకేచోట కదలకుండా కూర్చోవటం ధూమపానం చేసినదానికి సమానమనీ, దీనివల్ల దీర్ఘకాలంలో గుండెజబ్బులు, క్యాన్సర్‌, వెన్నునొప్పి వంటి సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 

ప్రమాదకరమైన మార్పులు

అటూ ఇటూ తిరగకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చొనేవారి శరీరంలోని లైపోప్రోటీన్‌ లైపేజ్‌ (ఎల్‌పీఎల్‌) అనే ఎంజైమ్‌ పనితీరు మందగిస్తుంది. ఈ ఎంజైమ్ చెడు కొలెస్ట్రాల్‌ను పీల్చుకొని దాన్ని కండరాల రూపంలోకి మారుస్తుంది. కదలకుండా కూర్చొనేవారిలో ఈ ప్రక్రియ ఆగిపోయి రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగిపోయి చివరికి.. పొత్తికడుపు, ఉదర భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ప్రమాదకరమైన ఈ కొవ్వు రక్తంలో కొవ్వును పెంచే హర్మోన్లను ఉత్పత్తి చేసి గుండె రక్తనాళాలు మూసుకుపోవడం, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే.. ఎక్కువ సమయం కూర్చొనే వారి కండరాలు తగిన కదలికలు లేక బిగుసుకుపోతాయి.

ఎక్కువసేపు కదలకుండా కూచోవటం వల్ల  భుజాలు కిందికి వాలిపోయి ఇది క్రమంగా భుజాలు, మెడ, నడుంనొప్పులకు దారి తీస్తుంది.  దీనికి కంప్యూటర్‌ టేబుళ్లు, కుర్చీల ఆకారం, ఎత్తు లోపాలు తోడైతే వెన్ను బలహీనపడి, ఆ ప్రభావం మెడ, వీపు, ఛాతీ, భుజాలు, చేతుల్లోని కండరాలు, నాడులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఈ మార్పులతో తొలగే ఇబ్బందులు

  • ప్రతి అరగంటకోసారి కుర్చీ నుంచి లేచి అటూఇటూ తిరగాలి.
  • రోజుకి కనీసం 40 నిమిషాల పాటు నడక లేదా జాగింగ్ తప్పనిసరి. ఇది కీళ్ల సమస్య రాకుండా చేస్తుంది.
  • ఆఫీసులో ప్రతిపనినీ ఫోన్ల సాయంతో గాక లేచి నాలుగడుగులు వేసి స్వయంగా చేసుకోండి.
  • తరచూ బలంగా శ్వాస తీసుకొని 10 అంకెలు లెక్కబెట్టి వదులుతుండాలి.
  • కూర్చున్నవారు చేతులు పై లేపటం, అటూ ఇటూ తిప్పటం వల్ల భుజాలకు తగిన విశ్రాంతి లభిస్తుంది.
  • ఫోన్‌ ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే కారిడార్‌లో అటూఇటూ తిరిగి మాట్లాడటం మంచిది.
  • యువత లిఫ్ట్ స్థానంలో మెట్లమార్గాన్ని మాత్రమే వాడాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE