• HOME
  • ఆరోగ్యం
  • పరిశుభ్రతతోనే నులిపురుగుల సమస్యకు చెక్

పిల్లల్లో ఎదుగుదల లోపాలకు నులి పురుగుల సమస్య ఒక ముఖ్య కారణం. పెద్దలు సైతం ఈ సమస్యకు మినహాయింపు కాదు. కలుషిత ఆహారం, చేతులు శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఉడకని మాంసం తినటమే ఈ సమస్యకు ప్రధానకారణాలు. కడుపులోని పేగులను ఆవాసంగా చేసుకొనే ఈ నులిపురుగులు ఆహారం ద్వారా అందే పోషకాలను అందిపుచ్చుకొని క్రమంగా వృద్ధి చెందుతాయి. సమయం గడిచే కొద్దీ ఇవి మరింత బలబడతాయి. అయితే వాటి ఉనికిని చాటే ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు గనుక ఈ సమస్యను త్వరగా గుర్తించటం కష్టం. ఈ సమస్య బాధితుల్లో పోషకాల లోపం తలెత్తి నానాటికీ క్షీణిస్తూ పోతారు. రోగ నిరోధక శక్తి తక్కువగా వుండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

లక్షణాలు

కడుపులో నులిపురులు ఉన్నప్పుడు జననాంగాల దగ్గర దురద పెట్టటం, రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరకడం, ఎంత తిన్నా బరువు పెరగకపోవడం, నానాటికీ బరువు తగ్గటం , తరచూ కనిపించే కడుపు నొప్పి, తిన్నది పూర్తిగా జీర్ణం కాకపోవడం, మానసిక, శారీరక అస్థిరత, మలవిస్జరనలో తెల్లని, సన్నని చిన్న పురుగులు పడటం, మలబద్ధకం, వికారం, వాంతులు, కడుపులో గ్యాస్ పేరుకున్నట్లు అనిపించడం ,కలత నిద్ర, రక్తహీనత, చర్మంపై దద్దుర్లు, చర్మం చిట్లటం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కనిపిస్తాయి.

నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు

  • పూర్తిగా ఉడికిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మాంసం విషయంలో ఈ జాగ్రత్త పాటించాలి.
  • శుద్ధిచేసిన నీటినే తాగాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
  • ఆరుబయట మల మూత్ర విసర్జన చేయరాదు.
  • ఇంట్లోకి పురుగులు,ఈగలు, ఇతర కీటకాలు రాకుండా జాగ్రత్త పడాలి.
  • కాలకృత్యాలు తీర్చుకున్న ప్రతిసారి, ఆహారం తీసుకునేముందు సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలి.
  • చేతి గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్లు బాగా పెరగకముందే కత్తిరించుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ కొరక్కూడదు.
  • పిల్లలు నోటిలో చేతులు పెట్టుకోవడం, మట్టిలో ఆడుకోవటం వంటివి చేయకుండా చూడాలి.
  • రోడ్డు వెంబడి చిరుతిండ్లు వద్దేవద్దు.

చికిత్స ..

పిల్లల్లో ఏలికపాములు, నులిపురుగులు, కొంకిపురుగులు అనే 3 రకాల పురుగులు ఉండే అవకాశం ఉంది. వీటి నిర్మూలనకు ఆల్బెండజోల్‌ మాత్రలు వాడాలి. 1-2 ఏళ్ళ వయసున్న పిల్లలకు 200ఎంజీ మాత్రను, మిగతావారు 400 ఎంజీ మాత్రను వేసుకోవాలి. భోజనం తర్వాత వేసుకోవచ్చు. కడుపులో పురుగులు ఉంటే మాత్రలు వాడిన 2 రోజులకు మలం ద్వారా బయట పడిపోతాయి. ధీర్ఘకాలిక రోగాల బాధితులు, ఇతర రోగాలకు మందులు వాడేవారు ఈ మాత్రలు వాడకూడదు. కడుపులో నులిపురుగులు ఉంటే.. ఈ మాత్రలు వేసుకొన్నతర్వాత వికారం, వాంతులు, కొద్దిగా జ్వరం వచ్చే అవకాశముంది. దాని వల్ల భయపడాల్సిన అవసరం లేదు.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

జపమూ యజ్ఞమే

పరమాత్మను చేరేందుకు సాయపడే సులువైన మార్గాల్లో జపం ముఖ్యమైనది. యోగసాధనలోనూ జపం ఒక ముఖ్యాంశంగా ఉంది. జప 

MORE