సకాలంలో నెలసరి రాకపోవటాన్ని వైద్యపరిభాషలో ‘ఎమెనోరియా’ అంటారు. అనారోగ్యకరమైన జీవనశైలి, పలు ఇతర కారణాల మూలంగా ఇటీవలి కాలంలో నెలసరి సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటిలో నెలసరి తేదీల్లో విపరీత మార్పులు, 2 నెలలకోసారి రావటం, నెలల తరబడి రాకపోవటం వంటి ఇబ్బందులు ముఖ్యమైనవి. ఈ సమస్య బాధితులకు తగిన రీతిలో చికిత్స అందించకపోతే వారు సంతానాన్ని పొందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. 

వర్గీకరణ

      తగిన వయసులో బాలికలు రజస్వల కాకపోవడాన్ని ప్రైమరీ ఎమెనోరియా  అంటారు. మెదడులోని పిట్యూటరీ గ్రంథి పనితీరు తగిన విధంగా లేకపోవటం లేదా జననేంద్రియాల్లో మార్పువల్ల కలిగే మానసిక వ్యాధులు ఈ సమస్యకు దారితీస్తాయి.

       నెలల తరబడి నెలసరి రాకపోవడాన్ని సెకండరీ ఎమెనోరియా  అంటారు. గర్భధారణ జరగకుండా సుమారుగా 4 నెలల పాటు ఈ నెలసరి రాకపోతే సెకండరీ ఎమెనోరియాగా గుర్తించాలి. హార్మోన్‌ల అసమతుల్యత, పోషకాహార లోపంతో శారీరక పటుత్వం తగ్గటం, గర్భనిరోధక మాత్రల మితిమీరిన వినియోగం, జన్యు లోపాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు.

 చికిత్స

      ఈ సమస్యను ముందుగానే గుర్తించి ప్రాథమిక స్థాయిలోనే అరికట్టకపోతే అది లేటుగా పిల్లలు కలిగేందుకు, సంతాన లేమికి కూడా దారితీయొచ్చు. ఆధునిక వైద్యంలో ఎమెనోరియాకు మంచి చికిత్స ఉంది. జీవనశైలి, వృత్తిపరమైన ఒత్తిడి, కుటుంబ చరిత్ర వంటి పలు వివరాల ఆధారంగా వైద్యులు తగు చికిత్సను అందిస్తారు.



Recent Stories







bpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE