గతంలో సౌకర్యాలు, విలాసాలుగా చెప్పుకొన్న అనేక ఉపకరణాలు నేడు రోజువారీ అవసరాలుగా మారాయి. వాటిలో ఏసీ కూడా ఒకటి. ఇప్పటి రోజుల్లో ప్రతి మధ్య తరగతి ఇంటిలోనూ ఏసీ కనిపిస్తోంది. కార్యాలయాలు, పరిశ్రమలు, వాహనాలలోనూ ఏసీ వినోయోగం ఎక్కువయ్యింది. ఆదాయాలతో బాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం, తేమ, రుతుకాలాల్లో వస్తున్న అనుకోని మార్పులు కూడా ఏసీల వినియోగాన్ని పెంచుతున్నాయి. వేసవిలో అయితే ఏసీ లేకుండా ఉండలేమనే భావన. ఇటీవలికాలంలో గ్రామాల్లోనూ వీటి వినియోగం పెరుగుతోంది. అయితే ఏసీ వినియోగం, పనితీరు వంటి అంశాలను సరిగా అవగాహన చేసుకొని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పలు శ్వాస కోశ సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
ముక్కు, ఊపిరితిత్తుల పాత్ర
ఏసీ ప్రభావానికి ముందుగా ముక్కు, ఊపిరి తిత్తులు గురవుతాయి. వాతావరణంలోని వేదిగాలిని చల్లబరచి ఊపిరితిత్తులకు అందించటమే ముక్కు పని. ఒకవైపు సహజసిద్ధమైన ఏసీ మాదిరి పనిచేస్తూనే ముక్కులోని సూక్ష్మమైన వెంట్రుకలు గాలిలోని దుమ్ము, ధోలి కణాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంటాయి. జలుబు చేసినప్పుడు ఈ రెండు పనులు ఆగిపోవటంతో అసౌకర్యంగా అనిపిస్తుంది. ముక్కుద్వారా అందిన గాలిలోని ప్రమాదకరమైన వాయువులను ఊపిరితిత్తులు మరోమారు వడపోసి అందులోని ఆక్సిజన్ ను రక్తానికి అందిస్తాయి. అదే సమయంలో గాలితో బాటు చేరే దుమ్ము, ధూళి కణాలను తుమ్ము, దగ్గుల రూపాల్లో బయటికి పంపుతాయి. ఒక రకంగా ఈ రెండు వయవాలు చేసే పనినే ఏసీ కూడా చేస్తుంది. ఏసీ లోని అత్యాధునిక ఫిల్టర్లు ఒకవైపు గాలిలోని ధోలి కణాలతో బాటు బాక్టీరియా వంటి కణాలను వడపోసి మంచి గాలిని అందిస్తూనే, మరోవైపు గాలిలోని తేమను, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. అల్లా విడుదలయ్యే గాలి నేరుగా మన ఊపిరి తిత్తుల్లోకి చేరుతుంది.
ఏసీ వినియోగం... జాగ్రత్తలు