వేగంగా ఆహారం లేదా నీరు తీసుకొనేటప్పుడు తడబడిన సందర్భాల్లో ఎక్కిళ్ళు రావటం సహజమే. నిజానికి ఇదేమీ భయపెట్టే సమస్య కాకపోయినా కాసేపు ఇబ్బంది పెట్టే సమస్యే. కొందరిలో 10 నిమిషాల్లోనే తగ్గే ఎక్కిళ్ళు మరికొందరిని మాత్రం గంటల తరబడి వస్తూనే ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మన పక్కవారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా నలుగురితో మాట్లాడేటప్పుడు, ప్రసంగాల సమయంలో ఎక్కిళ్ళు వస్తే ఆ ఇబ్బందిని మాటల్లో చెప్పలేము. అయితే ఎక్కిళ్లు విషయంలో కొద్దిగా అవగాహన ఉంటే ఇలాంటి సందర్భాల్లో సైతం ఈ ఇబ్బంది నుంచి వీలున్నంత త్వరగా బయటపడొచ్చు.

ఎక్కిళ్లు అంటే..

మన శరీరంలో ఛాతీ, కడుపు మధ్య భాగమే డయాఫ్రమ్. బోర్లించిన 'u' ఆకారంలో ఉండే ఆ భాగం శ్వాసించేటప్పుడు లోపలికి, శ్వాస వదలగానే పూర్వస్థితికి వస్తుంటుంది. అలాగే.. ఆహారం తీసుకునేటప్పుడు తగినట్లు కదులుతూ శరీరంలోని ఒత్తిడిని సమంగా ఉండేలా చేస్తుంది. మెదడులో ప్రత్యేక కేంద్రం నుంచి వచ్చే 'ఫ్రెనిక్‌ నాడి' ఈ డయాఫ్రం వరకు ఉంటుంది. ఈ రెంటిమధ్యా సమన్వయం జరిగినంతసేపు ఎక్కిళ్ళు రావు. అయితే ఆ సమన్వయం తప్పినప్పుడు శ్వాస తీసుకొంటే మాత్రం ఒక్కసారిగా స్వరపేటిక మూసుకొని 'హిక్‌ అనే చప్పుడు వస్తుంది. 'ఫ్రెనిక్‌ నాడి', డయాఫ్రంల మధ్య తిరిగి సమన్వయం కుదిరే వరకూ ఈ ఎక్కిళ్ళు వస్తూనే ఉంటాయి.

కారణాలు

సాధారణంగా ఘాటైన మసాలా, కారం పదార్థాలు తిన్నప్పుడు లేదా అతిగా ఆందోళన, దు:ఖం కలిగినప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి. కొందరిలో కిడ్నీ, మెదడు, గుండె, కాలేయ సంబంధిత వ్యాధులూ వెక్కిళ్లకు కారణం కావచ్చు. మరికొందరిలో మద్యపానం, పొగతాగటం వంటి అలవాట్లు, విష ప్రయోగం, గిట్టని ఆహారం తినటం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి. అయితే ఇబ్బందిగా, విసుగ్గా ఉంటుంది.

ఆగాలంటే?

  • గట్టిగా గాలి పీల్చి కొద్దిసేపు అలాగే పట్టి ఉంచితే డయాఫ్రం సర్దుకొని వెక్కిళ్లు వేగం, తీవ్రత తగ్గుతాయి.
  • కొద్దిగా చక్కెర లేదా చెంచా వెనిగర్ ను చప్పరిస్తే వెక్కిళ్లు నెమ్మదిస్తాయి.
  • వేడి వేడి సూప్‌ తాగినా మనసు వేడి, మంట మీదే ఎక్కువ దృష్టి నిలిచి వెక్కిళ్లు తగ్గుతాయి.
  • పెద్ద కాగితం కవరులో ముఖాన్ని పెట్టి గాఢంగా శ్వాసిస్తే రక్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయులు పెరిగి మరింత ఆక్సిజన్‌ తీసుకొనేందుకు డయాఫ్రం ప్రయత్నిస్తుంది. దీనివల్ల ఎక్కిళ్లు తగ్గొచ్చు.
  • నీరు లేదా కొబ్బరినీరు తాగినా వెక్కిళ్లు నెమ్మదిస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE