• HOME
  • ఆరోగ్యం
  • రెప్పపాటు లో ముప్పు తెచ్చేబ్రెయిన్ స్ట్రోక్

మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళంలో అవరోధం వల్ల రక్త సరఫరా ఆగిపోయి మెదడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యే పరిస్థితిని వైద్యపరిబాష లో బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. దీనికి తక్షణ చికిత్స తప్పనిసరి. లేనిపక్షంలో ఇది మరణానికి కారణం అయ్యే ముప్పు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణ కారణాల్లో బ్రెయిన్ స్ట్రోక్ మూడో స్థానం లో ఉంది. అందుకే దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయక సత్వర వైద్యం అందించాలి.

రక్తం లో కొలెస్ట్రాల్, కొవ్వు, వ్యర్ధాలు పెరిగి చిన్న చిన్న అవరోధాలుగా మారి రక్త సరఫరాను కొద్దికొద్దిగా అడ్డుకొంటాయి. కాలక్రమేణా ఈ అవరోధాల పరిణామం పెరిగి రక్తపు ముద్దల మాదిరిగా మారి రక్త ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకొంటాయి. దీనివల్ల స్ట్రోక్ రావటమే గాక ఒక్కోసారి రక్త నాళాలు చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

కారణాలు

వృద్ధాప్యం, వంశపారంపర్య కారణాలతో బాటు దిగువ అంశాలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావటానికి దోహద పడతాయి. అవి .. 

  • అధిక రక్తపోటు
  • మద్యపానం,ధూమపానం
  • శారీరక శ్రమ లేకపోవటం
  • రక్తం లో కొవ్వు నిల్వలు పెరగటం
  • స్థూలకాయం
  • ఉప్పు ఎక్కువగా తినడం
  • మధుమేహం 

స్ట్రోక్ రకాలు 

ఇస్కామిక్ స్ట్రోక్ : ఈ తరహా వాటిలో ఇస్కామిక్ స్ట్రోక్ ప్రధానమైనది. సంభవిస్తున్న ప్రతి 10 స్ట్రోక్ లలో 9 ఈ తరహావే. మెదడులో గడ్డకట్టిన రక్తం వల్ల మెదడకు రక్త సరఫరా ఆగినప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుంది. గడ్డకట్టిన రక్తపు ముద్ద మెదడులోని గాక మారె ఇతర భాగంలోనైనా అడ్డు పడవచ్చు.

రక్తశ్రావ కారకస్ట్రోక్ : మెదడులో బలహీన రక్తనాళం పగిలిపోయినప్పుడు ఈ స్ట్రోక్ వస్తుంది. ఈ రక్త స్రావ కారక స్ట్రోక్ కేసులు తక్కువే గానీ చాలా ప్రమాదకరమైనవి.

మినీ స్ట్రోక్ : మెదడకు రక్తం ప్రవహించే నాళాలు తాత్కాలికంగా మూసుకున్నా తిరిగి రక్తప్రవాహం పునరుద్దరి౦చబడుతుంది.

లక్షణాలు 

* అకస్మాతుగా ఒక వైపు శరీరం తిమ్మిరెక్కటం లేదా శరీరంలో బలహీనత ఏర్పడుట.

* నవ్వినప్పుడు నోరు వంకర పోవటం, మాటలో తడబాటు.

* రెండు చేతుల కదలికలు ఒకేలా లేకపోవటం

గుర్తించటం ఎలా ? 

వీటి లో ఏ ఒక్క లక్షణం కనిపించినా బ్రెయిన్ స్ట్రోక్ గా అనుమానించి వైద్యులు సలహా కోరటం అవసరం. ఏ సమస్య అనే అంశాన్ని బట్టి చికిత్స ఉంటుంది. పలు వైద్య పరీక్షల సాయంతో సమస్యను నిర్ధారిస్తారు. 

చికిత్స 

స్ట్రోక్ వచ్చిన తర్వాతి ప్రతి క్షణమూ విలువైనదే. మెదడులో ఆక్సిజన్ సరఫరా తగ్గేకొద్దీ అక్కడి కణాలు మరణించడం మొదలవుతుంది . మెదడులో నశించిన కణాలకు సంబంధించిన అవయవం పనిచేయటం ఆగిపోతుంది. సమస్య తీవ్రమైతే ఆ అవయవం పూర్తిగా దెబ్బతిని శాశ్వత అంగవైకల్యం ఏర్పడుతుంది. మెదడులో ఏర్పడ్డ అవరోధాలను కరిగించే ఔషధాలు ఉన్నప్పటికీ 3 గంటల్లోపు వాడితేనే మేలైన ఫలితాలుంటాయి. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యుని సంప్రదించడం అవసరం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE