గత 4 ఏళ్లుగా దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో మధుమేహుల సంఖ్య బాగా పెరుగుతోంది. సమస్యపై అవగాహన లేకపోవడం, చికిత్స అందుబాటులో లేకపోవడం, ఖరీదైన వైద్యం వంటి కారణాల వల్ల మధుమేహం అదుపుతప్పే స్థితికి చేరుకొంటోంది. మనదేశంలో సుమారు 7 కోట్ల మంది మధుమేహులుండగా, వీరిలో ఏటా 3.7 లక్షలమంది కన్ను మూస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ఇక.. హైదరాబాద్ మధుమేహ రాజధానిగా మారింది. మధుమేహం కారణంగా గుండెజబ్బుల ముప్పుసైతం గణనీయంగా పెరుగుతోంది. కనుక మధుమేహులు ముందునుంచే క్రమం తప్పని వ్యాయామం, తగిన ఆహారం, దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఈ సమస్యను పూర్తిగా అదుపులో పెట్టి జీవితాంతం ఆరోగ్యంగా జీవితాన్ని గడపొచ్చు. మధుమేహులు సొంతవైద్యం కంటే కచ్చితంగా డాక్టర్ల సలహాతో ఆధునిక వైద్యాన్ని ఉపయోంచుకోవడం మంచిది.

అధిక ముప్పు ఎవరికి?

మధుమేహం ఏ వయసు వారికైనా రావచ్చు. సాధారణంగా అధిక బరువు, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవటం, మితిమీరిన మానసిక ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్ అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారంపర్య కారణాల వల్ల మధుమేహం వస్తుంది. మధుమేహ చరిత్ర లేని కుటుంబాల వారిలో సాధారణంగా 45 - 65 సంవత్సరాల మధ్య ఇది కనిపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మధుమేహ లక్షణాలను గమనించి డాక్టర్ సలహా మేరకు మందులు వాడటంతోపాటు ఆహార, జీవన శైలిలోనూ మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది.

లక్షణాలు

 • అతి దాహం, మితిమీరిన ఆకలి, రాత్రి 4 సార్లు మూత్రానికి వెళ్లాల్సిరావటం
 • రక్తంలో గ్లూకోజ్ 250 కి మించి ఉండటం
 • మెదడు సంబంధిత సమస్యలు
 • కండరాల క్షీణత, బరువు తగ్గటం

ఆరోగ్య నియమాలు

 • తగినంత మేలైన ఆహారం తీసుకోవటం
 • రోజూ కనీసం అరగంటపాటైనా వ్యాయామం చేయటం
 • క్రమం తప్పక మందులు వాడటం
 • యోగా, ధ్యానం చేయటం ద్వారా ఒత్తిడికి దూరంగా ఉండటం

అదుపులో ఉంచేందుకు..

 • కడుపు నిండుగా తినటం లేదా బొత్తిగా ఖాళీగా ఉంచుకోవటం కాకుండా మోతాదులో ఆహారం తీసుకోవాలి.
 • ఒకపూట అన్నానికి బదులు రొట్టె, పచ్చి కూరగాయలు, పప్పు వంటివి తీసుకోవాలి.
 • రాగులు, జొన్నలతో చేసిన వంటకాలు, ఆకుకూరలు తీసుకోవటం మంచిది.
 • రోజూ ఉదయం ఓ గ్లాసు రాగి జావ మజ్జిగ కలుపుకొని తాగడం మంచిది.
 • రోజూ మెంతిపొడి లేదా నానబెట్టిన మెంతులు తీసుకోవటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE