• HOME
  • ఆరోగ్యం
  • దెబ్బతిన్న చిగుళ్లకు సత్వర చికిత్సే మార్గం

న దేశంలో నూటికి 22 మంది ఏదో ఒకస్థాయి చిగుళ్ల వ్యాధుల బాధితులేనని గణాంకాలు చెబుతున్నాయి. అయితే రోజువారీ పనులకు ఇబ్బంది లేకపోవటం, నొప్పి లేకపోవడం, వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవటం వంటి కారణాల వల్ల ఎక్కువమంది చిగుళ్ల వ్యాధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. నోటి దుర్వాసన, ఆహారం చిగుళ్లమధ్య ఇరుక్కుపోవడం, చిగుళ్ల వాపు, బ్రష్‌ చేసేటప్పుడు రక్తం కారటం వంటి లక్షణాలు కనపడితే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకొంటే భవిష్యత్తులో ఈ ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో చిగుళ్ల వ్యాధుల గురించి నిపుణులు అందిస్తున్న సమాచారం తెలుసుకుందాం. 

చిగుర్ల వ్యాధి అంటే ఏమిటి?

ఆహారం నమిలేటప్పుడు కొంత భాగం దంతాల మధ్య ఇరుక్కుపోయి మిగిలిపోతుంది. భోజనం తర్వాత నోరు పుక్కిలించటం, బ్రష్ చేసుకోవటం వంటి అలవాట్లు లేనివారిలో ఆ ఆహార అవశేషాలు పాచిగా లేదా గారగా మారి చిగుళ్లను, దానికింది ఎముకని దెబ్బతీసే బ్యాక్టీరియా లేదా ఇన్‌ఫెక్షన్‌ లను తయారు చేస్తాయి. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే చిగుళ్లు, దంతాలు దెబ్బతిని ఆహారం తీసుకోవటం కూడా కష్టమవుతుంది. 

రోజూ 2 సార్లు బ్రష్‌ చేసుకుంటే ఈ చిగుళ్ల సమస్యలు రావా?

ముందునుంచీ బ్రష్ చేసుకొంటే చిగుళ్ల సమస్యలేమీ రావు. అయితే.. ఒకసారి గార ఏర్పడిన తర్వాత బ్రష్‌ చేసుకొన్నా పళ్లు అరిగిపోయి పచ్చగా మారటం తప్ప ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు.

 దంతాల మీది గార, చిగుళ్లలో చేరిన ఇన్‌ఫెక్షన్‌ వదిలిపోయేదెలా?

దంతాల మీద పేరుకుపోయిన పచ్చని గారను స్కేలింగ్‌ ద్వారా తొలగించవచ్చు. చిగురు కింద ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత తక్కువగా ఉంటే డీప్‌ క్లీనింగ్‌ ద్వారా, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే ప్లాప్‌ సర్జరీ లేదా గమ్‌ సర్జరీ ద్వారా తొలగించవచ్చు.

ప్లాప్‌ లేదా గమ్‌ సర్జరీ నొప్పిగా ఉంటుందా? దీన్ని ఎవరైనా చేయించుకోవచ్చా?

పాత పద్దతిలోగమ్‌ లేదా ప్లాప్‌ సర్జరీలో చిగుళ్లు కత్తెరించాల్సి వచ్చేది. దీనికి సుమారుగా 6 గంటల సమయం పట్టేది. పాత విధానంలో చికిత్స అనంతరం బాధితుడికి తీవ్రమైన నొప్పి, వాపు ఉండేది. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లేజర్‌ మూలంగా లేజర్‌ గమ్‌ సర్జరీ కేవలం గంటలోనే పూర్తి అవుతుంది. ఇందులో ఎలాంటి కోత,కుట్లు ఉండవు. ఒక పూటకు మించి విశ్రాంతి కూడా అవసరం లేదు. మరునాడే ఆఫీసుకు కూడా వెళ్లవచ్చు. దీన్ని షుగర్‌, హార్ట్‌, బిపి బాధితులూ నిర్భయంగా చేయించుకోవచ్చు. 

 మధుమేహులకు చిగుళ్ల వ్యాధుల బెడద ఎక్కువా?

ఆరోగ్యవంతుల కంటే మధుమేహుల్లో చిగుళ్ల వ్యాధుల బెడద మూడు రెట్లు అధికం. మధుమేహులకు చిగుళ్ల సమస్యలు ఉంటే మధుమేహం ఒక పట్టాన అదుపులోకి రాదు. కనుక వీరు ముందు నుంచే చిగుళ్ల వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

చిగుల్లా వ్యాధుల బాధితులు లేజర్‌ చికిత్స తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి?

రోజూ 2 సార్లు సరైన పద్దతిలో బ్రష్‌ చేసుకోవడం, దారం సాయంతో దంతాల మధ్య ఇరుక్కున్న వ్యర్థాలను తొలగించటం, ఏడాదికి 2 సార్లు దంతాలు క్లీన్‌ చేయించుకోవటం వంటి జాగ్రత్తలు పాటిస్తే చాలు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE