• HOME
  • ఆరోగ్యం
  • బొడ్డు తాడుతో భవిష్యత్ అనారోగ్యాలకు చెక్

            తన బిడ్డ కలకాలం ఆరోగ్యంగా వుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. తపన పడుతుంది. ఒకవేళ భవిష్యత్తులో తన బిడ్డకు అనారోగ్యం పాలై ఏదైనా అవయవం కోల్పోవాల్సి వస్తే? ఒకే ఒక్క కణంతో పాడైన తన బిడ్డ అవయవాన్ని మళ్లీ సృష్టించవచ్చని తెలిస్తే... ఏ అమ్మ అయినా ఆ కణాన్ని తన ప్రాణ సమానంగా దాస్తుంది. ఆ కణం మరెక్కడో లేదు... తన కడుపులోని బిడ్డకు ఆహారాన్ని అందించే తన బొడ్డుతాడులోనే ఉంది. ఆ బొడ్డుతాడు కణాలనే మూలకణాలు (స్టెమ్ సెల్స్) అంటారు. ఆ మూలకణాన్ని దాచి ఉంచితే చాలు... మున్ముందు ఆ బిడ్డ శరీరానికి చెందిన ఏ అవయవాన్నైనా పునరుత్పత్తి చేయడం సాధ్యపడుతుంది. అయితే ఈ బొడ్డుతాడు సేకరణ తల్లి ప్రసవ సమయంలో మాత్రమే సాధ్యపడుతుంది.

బొడ్డుతాడు (అంబిలికల్)

 సాధారణంగా కాన్పు కాగానే బొడ్డుతాడును కత్తిరించి పారేస్తారు. ఇందులోనే విలువైన మూల కణాలు ఉంటాయి. వాటినే హెమటోపాయినిక్ సెల్స్ అంటారు. ఈ మూల కణాలను ఆయా శరీర భాగాల్లోకి ప్రవేశపెడితే తిరిగి అక్కడ నూతన కణాలు ఏర్పడి వ్యాధిని నయం చేస్తాయి. ఇప్పుడు ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. 

 ఒకసారి స్టెమ్‌ సెల్స్‌ దాచుకుంటే షుగర్‌, బిపి నుంచి క్యాన్సర్‌ వరకూ పలు రోగాల నుంచి తేలికగా బయటపడవచ్చు. బట్టతల, వినికిడి సమస్యలు, మధుమేహం, గుండెజబ్బులు, పెద్ద పేగుల్లో వచ్చే సమస్యలు, రక్త నాళాల సమస్యలు, జ్ఞాపక శక్తి, మెదడు గాయాలు వంటి సమస్యలకు ఈ కణాల సాయంతో చికిత్స అందించవచ్చు. శరీరంలో దెబ్బతిన్న కణాల స్థానంలో వీటిని ఇంట్రావీనస్ పద్ధతిలో ప్రవేశపెడితే .. ఆ మూలకణాలు దెబ్బతిన్న లేదా గాయపడిన భాగానికి వెళ్లి అక్కడి వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణను మెరుగుపరచి ఆ వ్యాధిని తగ్గిస్తాయి. ఈ మూల కణాలతో అల్జీమర్స్, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, కండరాల సమస్యలు, పార్కిన్ సన్స్ వ్యాధి, మెదడు, వెన్నెముక గాయాలు, పక్షవాతం, గర్భాశయ సమస్యలకు వంటి 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఆధునిక పరిశోధనలు తేల్చాయి. ఈ మూల కణాలు మానవ శరీరంలో 200 రకాల కణాలు, అవయవాలు, వ్యవస్థలను మళ్లీ పునరుజ్జీవింప చేయటమే గాక ఒక్కో మూలకణం ఎర్ర రక్త కణంగా, నరాల కణంగా, కండరాల కణంగా విడిపోగలుగుతుంది.

అవగాహన...

 ఈ మధ్యకాలంలో చాలామంది తమ పిల్లల మూలకణాలను భద్రపరుస్తున్నారు. ప్రముఖ ఆసుపత్రుల్లోని మూలకణాల బ్యాంకులు ఈ తరహా సేవలు అందించటంతో ఇప్పుడిప్పుడే ఈ అంశం మీద అవగాహన పెరుగుతోంది. తమ మొదటిబిడ్డ సమయంలో వీటిని సేకరించని వారు రెండో కాన్పు సమయంలోనైనా మూలకణాలను సేకరించి భద్రపరిస్తే.. అవే రెండో బిద్దతోబాటు మొదటి బిడ్ద్దకూ ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని సేకరించి బ్యాంకులో దాచుకుని మీ బిడ్డలకు రక్షణ కల్పించుకోవచ్చు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE