మూర్తీభవించిన ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. మర్యాదా పురుషోత్తముడైన ఆ మహానుభావుడు ఈ భూమిపై సాధారణ మానవుడిగా జన్మించిన దినమే శ్రీ రామనవమి. చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నసమయాన పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని ప్రజల విశ్వాసము.

 తెలుగు వారు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపునే పండుగలలో శ్రీ రామ నవమిది ప్రత్యేక స్థానం. తెలుగు నేలపై జరిగినంత వైభవంగా దేశంలో ఎక్కడా శ్రీరామ కల్యాణం జరగదంటే అది అతిశయోక్తి కాదు.  శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పుతో బాటు బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. భద్రాచలంలో రామదాసు నిర్మించిన భవ్యమైన రామలయంలో, ఏటా ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి సీతారామ కళ్యాణానికి  ముత్యాల తలంబ్రాలు సమర్పించటం అనాదిగా వస్తోంది.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE