వైశాఖ శుద్ధ తదియనాడు అక్షయ తృతీయగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.  సృష్టి ఈ రోజునే ఆరంభం అయిందని  భవిషోత్తర పురాణం ప్రకారం చెబుతోంది. కృత యుగంలో శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు నరసింహునిగా వచ్చినదీ ఈ రోజే. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయనాడే ఆరునెలల పాటు మూసి ఉంచే బదరీ నారాయణుని ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. ఈ రోజునే సింహాచలంలో వైభవంగా జరిగే చందనోత్సవం సందర్భంగా  సింహాచలేశుడు తన భక్తులకు నిజరూప దర్శనాన్ని కలుగచేస్తాడు. ఇదేరోజున బలరామ జయంతిని జరుపుకొంటారు.

 అయితే ఇటీవలి కాలంలో దీని అసలు విశేషాలను పక్కన బెట్టి కేవలం బంగారం కొనే పండుగగా దీన్ని ఎక్కువమంది భావిస్తున్నారు. ధర్మ బద్ధంగా గాక  అప్పు చేసో, తప్పు చేసో బంగారం కొంటే, అది అక్షయం కాకపోగా ఈ అప్పులు, తప్పులు,  పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.ఈ నెల 9వ తేదీ అక్షయ తృతీయ ఈ సందర్భంగా ఈ పండుగకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

అక్షయం అంటే క్షయం లేనిది, కానిది  అని అర్థం. ఈ రోజు విధిగా చేయవలసినది దానం. ఈ రోజు శక్తి కొద్దీ చేసే దానం అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు. దానంతో బాటు ఈ రోజు చేసే హోమం, అర్చనలకు విశేష ఫలం ఉంటుందని శ్రీ కృష్ణుడు, ధర్మరాజుకు చెప్పిన కథ మహాభారతంలో కనిపిస్తుంది.  

ఈ రోజున బంగారం కొంటే సిరి తమ ఇంట నిలుస్తుందనే నమ్మకం వల్ల పలువురు నగల వంటివి ఈ రోజే కొనేందుకు ఆసక్తి చూపుతారు .  బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా చిత్రం ముందు ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. బంగారం కొనలేని వారు కనీసం ఉప్పు కొన్నా చాలు. 

అక్షయ తృతీయ నాడు  సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి లక్ష్మీ నారాయణులను పూజిస్తే సకల శుభాలు చేకూరతాయి.  ఈ రోజు ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను, శనగలు వాయనమిస్తే కలకాలం సుమంగళిగా ఉంటారనీ,  ఆ ఇంట సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం. ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు తొలగిపోయి, శివైక్యం చెందుతారని శైవుల నమ్మకం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE