రోజూ ఇంట్లో దీపారాధన చేయటం హైందవ సంప్రదాయంలో ఒక భాగం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని  అని శాస్త్రవచనం. సూర్యోదయ, సూర్యాస్తమయాల వేళ  వెలిగించిన దీపం ఐశ్వర్యకారకమని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. దీపం జ్ఞానానికీ, సంపదకు , శాంతికీ ప్రతీకగా పెద్దలు భావిస్తారు. దేవతలు తేజస్సుతో కూడి ఉంటారనీ, అందుకే ఎక్కడ దీపం ఉంటే  అక్కడ దేవతలు ఉంటారని చెబుతారు.

దీపారాధన చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి తప్ప ముందుగా వత్తులు వేయరాదు. మట్టి కుందులు, వెండి, ఇత్తడి,పంచ లోహ కుందులు దీపారాధనకు  వాడవచ్చు.అయితే  స్టీలు కుందుల్లో మాత్రం దీపారాధన చేయరాదు. కుందులను కూడా ఏ రోజుకారోజు  శుభ్రంగా కడిగి ఉపయోగించాలితప్ప శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్దతి కాదు. నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనెలలో ఏది ఉంటే దానితో దీపారాధన చేయవచ్చు.

ఎన్ని వత్తులు?

సాధారణంగా రెండు వత్తులతో దీపారాధన చేయటం సంప్రదాయం. అయితే కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులున్న వారికి నిర్ణీత సంఖ్యలో ఒత్తులు వేసి దీపారాధన చేయటం వల్ల  మేలు జారుతుందని పెద్దల అభిప్రాయం. అంటే.. సంతానం కోరుకొనే వారు 9 వత్తులు , వివాహ ప్రాప్తికై 3 వత్తులు, విద్యలో రాణింపుకు 4 వత్తులు వేసి దీపారాధన చేయాలి. అప్పుల బాధలు తొలగాలన్నా, వ్యాపారం బాగుండాలన్నా 6 వత్తులు, ఉద్యోగ ప్రాప్తికి 5 వత్తులు, కుజ దోషం ఉన్న వారు 3 వత్తులు వేసి చేయాలి. మానసిక సమస్యలతో బాధ పడేవారు 2 వత్తులు, అపమృత్యు దోష నివారణకు 10 వత్తులు, ఏలినాటి శనిని శాంతపరచేందుకు 7 వత్తులు ఉపయోగించాలి. లక్ష్మీ అనుగ్రహానికి 12 వత్తులు, రాజ్యాధికారం కోసం 14 వత్తులతో దీపారాధన చేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE