శ్రావణ మాసం వచ్చేసింది. చాంద్రమానం ప్రకారం అయిదవ నెల శ్రావణం. ఈ  మాసం కొత్త ప్రకృతి అందాలు, కొత్త మొలకలు, పచ్చదనాలు మొదలయ్యే చల్లని నెల. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంతో కూడి ఉంటాడు గనుక ఈ మాసాన్ని  శ్రావణం అంటున్నాం . శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణమే గనుక ఈ నెలలో ఆయనను ఆరాధిస్తే ఆయన ఆశీర్వాదంతో బాటు ఈ జగతిని పోషించే లక్షణ శక్తి అయిన లక్ష్మీదేవి కృప కూడా లభిస్తుంది.  శ్రవణం అంటే వినటం అని అర్థం. ఈ మాసంలో భగవన్నామం విన్నా మోక్షం లభిస్తుందని  పెద్దలు చెబుతారు. మనస్సును ఇతర ప్రభావాల నుంచి పరమాత్మ మీదికి మళ్లించి శాంతిని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని పొందేందుకు ఈ మాసంలో పలు పూజలు, వ్రతాలు చేస్తారు.

మంగళగౌరీ వ్రతం

శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు ఈ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు తప్పక ఈ వ్రతాన్ని చేస్తారు.

వరలక్ష్మీ వ్రతం

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం సాయంత్రం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఏ కారణం చేతనైనా ఆ రోజు వీలు కానివారు నెలలో ఏ శుక్రవారమైనా దీన్ని చేసుకోవచ్చు.ఈ వ్రతం  చేసిన స్త్రీలకు  సర్వ సౌభాగ్యాలు, పసుపు కుంకుమలు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. ఈ వ్రతం చేసిన వారికి అష్ట లక్ష్మీ ఆశీర్వాదం లభిస్తుందని చెబుతారు. ఈ రోజున  ఇరుగు, పొరుగు స్త్రీలను వ్రతానికి ఇంటికి పిలిచి మొలకెత్తిన శనగలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, రవికల గుడ్డ మొదలగునవి 'వాయినం' గా ఇవ్వటం సంప్రదాయం. ఇస్తారు.

ఈ మాసపు ఇతర విశిష్టదినాలు

  • శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణ వచనము. ఈ రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతములు విశేష ఫలితాన్ని ఇస్తాయి. అట్లాగే, ఈ రోజున హయగ్రీవుని ద్వారా ఉపదేశించబడిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టటం మంచిది.
  • శ్రావణ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం రోజున శ్రీ సత్యనారాయణ స్వ్వామి వ్రతం చేస్తే చాలా మంచిది.
  • పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి, అనగా శుద్ధ చతుర్ధి రోజున చేసే సుబ్రహ్మణ్య లేక నాగ దేవత అభిషేకం చేసినవారికి సంతాన సంబంధ దోషములు నివృత్తి అవుతాయి.
  • పౌర్ణిమకు ముందు వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి, లలితా ఏకాదశీ అని కూడా అంటారు. పుత్ర సంతానం కలగటానికి ఈ రోజున పుత్రదా ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తారు.
  • శ్రావణ పూర్ణిమ శ్రీ సంతోషీమాతా జయంతి. ఈ రోజున శ్రీ సంతోషీమాతా వ్రతము చాలా విశేషము. శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమగా జరుపుకోవటం తెలిసిందే.
  • పూర్ణిమ తర్వాత వచ్చే విదియ నాడే మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి బృందావన ప్రవేశం చేసారు. ఈ రోజున శ్రీ రాఘవేంద్ర అర్చన, అభిషేకములు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి.
  • బహుళ అష్టమి రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఆ రోజున పిల్లలతో శ్రీ కృష్ణ పూజ చేయించి వెన్న, అటుకులు నైవేద్యం పెట్టించటం మంచిది. 
  • బహుళ ఏకాదశి రోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించటం వల్ల మనస్సులో వుండే కోరికలు శీఘ్రంగా నెరవేరతాయి. ఈ రోజున వెన్న నైవేద్యం పెట్టటము మంచిది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE