''ఓం'' అనే అక్షరం సంస్కృత భాషకు చెందినది. ఇది పరమ పవిత్రమైన ప్రణవ స్వరూపం. మహాశివుడు చేసిన ఢంకా నాదం నుంచి ఆవిర్భవించిన ఓంకారాన్ని సాక్షాత్తూ శివస్వరూపంగా చెబుతారు. ఓంకారాన్ని మించిన మాత్రం లేనేలేదని పెద్దలు చెబుతారు. రోజూ ఓంకారాన్ని జపించేవారికి మనో నిగ్రహం, ఏకాగ్రత తో బాటు చక్కని ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. ఓంకారానికున్నఅర్ధాలనూ, వాటి వెనకున్న విశేషాల గురించి తెలుసుకుందాం. 

  • ఓంకారం అంటే తేజస్సు. ఇది సర్వ లోకానికీ వెలుగునిస్తుంది.
  • ఓంకారం ప్రతి జీవినీ ప్రేమించే తత్వాన్ని పెంపొందిస్తుంది.
  • ఓంకారం ప్రశాంతతని, ఆనందాన్ని, సంతృప్తిని ప్రసాదిస్తుంది.
  • ఓంకారం గ్రహణశక్తిని పెంచి, అనేక అంశాలను సులభంగా నేర్చుకునేందుకు దోహదపడుతుంది.
  • ఓంకారం రోజువారీ జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల నుండి రక్షిస్తుంది.
  • ఓంకారం సృష్టిని సమగ్రంగా అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది. 
  • ఓంకారం ప్రళయకాలంలో జగత్తును తనలో లీనం చేసుకుంటుంది.
  • ఓంకారం స్థూల, సూక్ష్మ, గుప్త, శబ్ద, నిశ్శబ్దాలను స్పష్టంగా గ్రహిస్తుంది.
  • ఓంకారం ప్రబోధాత్మకమైన బుద్ధిని ప్రసాదిస్తుంది.
  • ఓంకారం చరాచర జగత్తును శాసిస్తుంది.
  • ఓంకారం జ్ఞాన స్వరూపం. ఇది అజ్ఞానాన్ని, అంధకారాన్ని నశింపచేస్తుంది.
  • ఓంకారం విద్యను, వివేకాన్ని, తేజస్సునూ, సంపదనూ ఇస్తుంది.
  • ఓంకారం సర్వ వ్యాపకం.
  • సర్వ వ్యాపకం శుద్ధ అంతఃకరణను ప్రసాదిస్తుంది.
  • ఓంకారం సమస్త జగత్తుకూ నాయకత్వం వహిస్తుంది.
  • ఓంకారం సర్వ వ్యాపకం కోరికలకు దూరంగా ఉంటూ, అందరి శ్రేయస్సూ కోరుకోవాలని ఉపదేశిస్తుంది.



Recent Stories







bpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక పూర్ణిమ విశేషాలు

నేడు కార్తీక పౌర్ణమి. శివుడికి మహాశివరాత్రి తర్వాత అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమే. ఈ రోజునే పరమేశ్వరుడు 

MORE