మహాగణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలున్నాయి. మట్టితో వినాయకుడిని చేయటం, పూజానంతరం ఆ ప్రతిమను పత్రితో సహా నిమజ్జనం చేయడం వెనుక 3 పర్యావరణ హితమైన అంశాలు దాగున్నాయి. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  

  • చెరువుల్లోనూ, కుంటల్లోనో మట్టి తీసుకువచ్చి గణపతి ప్రతిమలు చేయటం మూలంగా వానాకాలం కాలవలు, కుంటలు, చెరువుల్లో కొంత మట్టి తగ్గి వాటిలో నీటినిలువ సామర్థ్యం పెరిగేది. ప్రతిమల తయారీ పేరుతో జరిగే పూడికతీత వల్ల సహజంగానే భూగర్భజల మట్టం పెరిగేది. అంటే ఇది ఒక రకంగా జలయజ్ఞమే.
  • కొన్ని ప్రాంతాల్లో పూజాదికాలయ్యాక గణేశ మూర్తిని,పత్రితోనూ, నవధాన్యాలతోనూ కలిపి ఇంటిపెరడులోని చెట్టు పాదిలోనే నిమజ్జనం చేస్తారు. పూజాద్రవ్యాల్లోని పోషకాలు, పత్రిలోని విశిష్టగుణాలన్నీ వానల కారణంగా భూమిలోకి ఇంకి, పక్కనే ఉన్న చెట్టుకు ఎరువుగా మారుతుంది.
  • కొందరు వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదా కుంటలోనూ నిమజ్జనం చేస్తారు.  చెరువులు, కుంటలు లేని చోట బావిలో కూడా నిమజ్జనం చేస్తారు. పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక, 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ జలంలోకి చేరి నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం కూడా పెరుగుతుంది.                                   



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

రామనామ విశిష్టత

కలియుగంలో భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవన్నామంలో ఒక 

MORE