గజముఖుడైన గణేశునకు 21 రకాల పత్రితో పూజ చేయాలని పెద్దలు చెబుతారు. ఈ పూజలో ఉపయోగించే పత్రిలో విశేషమైన ఔషధ గుణాలున్నాయి. అవి నేత్ర, మూత్ర, చర్మ తదితర రోగాలకుమందుగా పని చేస్తాయి. పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం, తాకటం వల్ల వృక్ష సంబంధమైన రసాయన పదార్థాలు శరీరం లోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వినాయకుని పూజ వలన మనకు విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. అందుకే ఈ వినాయకచవితినాడు అంటే అందరికీ ఇష్టం. ఏ ఏ రకాల పత్రితో గనెహాసుని పూజించాలి? అప్పుడు చదవాల్సిన మంత్రాల వివరాలు తెలుసుకుందాం.
- ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి మాచిపత్రి
- ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి వాకుడు
- ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి మారేడు
- ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి గరిక
- ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి ఉమ్మెత్త
- ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి రేగు
- ఓం గుహాగ్రజాయ నమః ఆపామార్గ పత్రం పూజయామి ఉత్తరేణి
- ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి తులసి
- ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి మామిడి
- ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి ఎర్ర గన్నేరు
- ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి విష్ణుకాంత
- ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి దానిమ్మ
- ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి దేవదారు
- ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి మరువం
- ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి వావిలి
- ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి జాజి
- ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి దేవకాంచనం
- ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి జమ్మి
- ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి రావి
- ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి తెల్ల మద్ది
- ఓం కపిలాయ నమః ఆర్క పత్రం పూజయామి జిల్లేడు