• HOME
  • భక్తి
  • కోర్కెలు తీర్చే తల్లి.. కూష్మాండ

దుర్గమ్మ నాలుగోరోజు అవతారం కూష్మాండ. గాఢాంధకారంలో మునిగిన జగత్తును లీలతో క్షణకాలంలో తిరిగి సృష్టించిన తల్లి కూష్మాండ. ఈ సృష్టిలో చరాచర ప్రాణి కోటిలో అంతర్లీనంగా భాసిస్తున్నది ఈ ఛైతన్యమే. జ్ఞానరూపిణిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవి అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. సంసారమనే జగత్తును ఉదరంలో నిలుపుకున్న మాయారూపిణి ఈ తల్లి. కూష్మాండము(గుమ్మడికాయ) అంటే ప్రీతి గలిగిన అమ్మగనుక ఈమెకు ‘కూష్మాండ’ అనేపేరు వచ్చింది.

రూప విశేషాలు

అమ్మవారు సూర్యకిరణ శోభతో మెరిసిపోతూ దర్శనమిస్తుంది. 8 భుజాలతో విలసిల్లే ఈ మాతను ‘అష్టభుజాదేవి’ గానూ పిలుస్తారు. 7 చేతులలో వరుసగా కమండలం, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్రము, గదలతోతేజరిల్లుతూ ఉండే అమ్మవారి 8వ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది.

నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. ఈ అమ్మవారిని ఉపాసకులకు మంచి ఆయుష్షు, ఆరోగ్యము ప్రాప్తిస్తాయి.భక్తులు చూపే కొద్దిపాటి భక్తి శ్రద్ధలకే అమ్మవారు ఎంతగానో పొంగిపోయి ప్రసన్నురాలు అవుతుంది. ఈ రోజు అమ్మవారికి (చిల్లిలేని) అల్లం వేసిన మినప గారెలనునివేదన చేస్తారు.

శ్లోకం

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।

దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE