• HOME
  • భక్తి
  • బతుకు చిత్ర ప్రతీక..బ‌తుక‌మ్మ‌

మన దేశంలో దసరా అనగానే ముఖ్యంగా దుర్గాపూజ గురించే ముందుగా మాట్లాడతారు. అయితే తెలంగాణలో మాత్రం దసరా అనగానే ముందుగా బతుకమ్మ గుర్తుకొస్తుంది. సర్వజన హితం,ప్రకృతి పరిరక్షణ వంటి ఎన్నో అంశాలు ఈ పండుగలో అంతర్లీనంగా దాగివున్నాయి. ఏ పండుగకు వచ్చినా రాకున్నా ఈ బతుకమ్మ పండుగకు మాత్రం ఎక్కడెక్కడి తెలంగాణ ఆడపడుచులు పుట్టిళ్లకు చేరుకుంటారు. అంతరాలకు అతీతంగా పల్లెల్లో మహిళలంతా మసకబడే వేళకి రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఎత్తుకొని ఒక చోట చేరిసరళమైన పల్లె పదాలతో కూర్చిన బతుకమ్మ పాటలు పాడే తీరు విని, చూసి ఆనందించగలమే తప్పమాటల్లో చెప్పలేము. ఈనో విశిష్టతల సమాహారమైన బతుకమ్మ పండుగకు సంబంధించిన కొన్ని విశేషాలు.. 

పండుగ నేపథ్యం

పూర్వం ధర్మాంగదుడనే రాజుకు కలిగిన సంతతి పుట్టిన కొన్నాళ్లకేచనిపోతుండటంతో ఆ దంపతులు శరన్నవరాత్రుల్లో అమ్మవారినిఆరాధించి , తమకు పుట్టబోయే బిడ్డ బతకాలనీ, ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టుకుంటామని మొక్కుకున్నారట. అమ్మదయతో వారి కోరిక నెరవేరగా మాట ప్రకారం పుట్టిన బిడ్డకుబతుకమ్మ అని పేరు పెట్టారనీ, అప్పటి నుంచే ఈ పండుగ జరుగుతోందని పెద్దలు చెబుతారు.

ప్రకృతి హిత పండుగ

 ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయళ్లలో పూసి ఉంటాయి. వీటిలో గునుక పూలు, తంగేడి పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. ఈనేపథ్యంలో ఆకట్టుకొనేప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీరిస్తూ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. పూజల తర్వాత ఇన్ని రకాల పువ్వులతో కూడిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనంచేయటం ద్వారా వాటిలోని ఔషధ గుణాలుప్రవాహపు నీటి ద్వారా చేరిన హానికారకాలను తొలగిస్తాయి. పొద్దుబోయే వేళ కొద్దిపాటి చలి వాతావరణంలో గంటల తరబడి బతుకమ్మ ఆడటం మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. దీనివల్లరోగనిరోధక శక్తి వ్యవస్థను బలోపేతమైశీతాకాలంలో ఎలాంటి అనారోగ్యమూ దరిజేరదు.

 9 రోజుల వేడుక

నవరాత్రుల మాదిరిగానే బతుకమ్మ 9 రోజుల పండుగ. దీనినిభాద్రపదఅమావాస్య నుంచి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఇందులో భాగంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను పూజిస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు పప్పుబతుకమ్మ, నాల్గో రోజు బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ( పూజ ఉండదు) , 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మగా నిర్వహించి అనంతరం బతుకమ్మలను సమీప బావులు, నదులు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అమావాస్య రోజున బతుకమ్మ బావి తవ్వి ఆ రోజు నుంచి 5 రోజుల పాటు బొడ్డెమ్మ ఆడుతారు. ఈ 9 రోజులూ పూలతో అలంకరించిన బతుకమ్మలను బావిలో నిమజ్జనం చేస్తారు.

పాటే ప్రాణం

 బతుకమ్మ పాటల్లో కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాల వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. వినసొంపైన ఈ పాటలుతెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. రాతప్రతులు, పుస్తకాల ప్రమేయం లేకుండానే వందల ఏళ్లుగా జనం నాలుకలపై ఆడుతూ వస్తున్న ఈ సాహిత్యం ఈ ప్రాంత అస్తిత్వానికి గుండెచప్పుడుగా నిలిచిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. నాటి నవాబులు, భూస్వాముల పదఘట్టనల కింద నలిగిపోయిన గ్రామీణ తెలంగాణ అనుభవించిన వేదన, దాన్ని ఎదిరించాలనే సంకల్పం, అందరి మేలు కోరాలనేసంకల్పం ఈ పాటల్లో ప్రధానంగా కనిపిస్తాయి. 

ఆకట్టుకొనే బతుకమ్మల అందం

 బతుకమ్మ అమెరికాలో తంగేడు పువ్వుది ప్రత్యేక స్థానం. మొదట తంగేడు ఆకులు పరచి వాటిపై తంగేడుపూల కట్టలని పొందికగా అమర్చుతూ మధ్య మధ్యలో బంతి, చేమంతి, నంది వర్ధనం, సీతమ్మ జడలు, బీరపువ్వు, గునుగుపువ్వు, గుమ్మడిపూలు, బంతిపూలు, మందారం పూల వంటివి వాడుతూ బతుకమ్మను తయారు చేస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. బతుకమ్మను పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరమ్మనుపెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని ఇంట్లో దేవుని దగ్గర పెట్టి పూజించి తర్వాత అందరూ తెచ్చిన బతుకమ్మలను ఒకచోట పెట్టి బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటల రూపంలో అమ్మవారిని స్తుతిస్తారు. అనంతరం వాటిని చెరువులో నిమజ్జనం చేసి ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి (మొక్కజొన్న లేదా వేరుశనగ లేదా పెసలను దోరగ వేయించి పిండి చేసి చక్కెరలేదా బెల్లం పొడి, నెయ్యి తగినంత కలిపినది) ఇచ్చి పుచ్చుకొని తింటారు.

 కాలంతో బాటు వచ్చిన మార్పులు

ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో ఎక్కువగా కనిపించిన ఈ పండుగ సందడి ఇప్పుడు అక్కడికంటే పట్టణ, నగర ప్రాంతాలల్లోనూకనిపించటం సంతోషించాల్సిన విషయం.ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించటం, అందిస్తున్న సహకారం, బతుకమ్మ సాహిత్య కృషికి జరిగిన కృషి వంటి పలు కారణాల వల్ల ఈ పండుగ జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణేతరులు సైతం ఇప్పుడు ఈ పండుగను తమదిగా భావించి జరుపుకోవటం మరో విశేషం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE