నవరాత్రి ఉత్సవాలలో ఐదవ అవతారం స్కందమాత. బాల స్కందుడిని (సుభ్రమణ్య స్వామి) ఒడిలోపెట్టుకొని మాతృ స్వరూపిణిగాఅమ్మ దర్శనమిస్తుంది. రెండు చేతులలో పద్మాలతో, మరో చేతితో అభయ ముద్రను ప్రదర్శిస్తూ దక్షిణ హస్తంతో బాల కార్తికేయుడిని పొదివి పట్టుకొని కనిపించే అమ్మను భక్తితో ఆరాధిస్తేకోరికలు నెరవేరుతాయి. 

ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది. దీనివల్ల సాధకుని మనసు ప్రాపంచిక సంబంధాల నుంచి చైతన్య మార్గం వైపు పయనిస్తుంది. సింహవాహన అయిన ఈ తల్లిని శ్రద్ధతో ఉపాసన చేస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. స్కందమాతను పూజిస్తే ఒడిలో కూర్చొని ఉండే స్కందుణ్ణీ పూజించినట్లే. స్కందమాత సూర్యమండల అధిష్ఠాన దేవత గనుక . ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో విరాజిల్లుతుంటారు.

శ్లోకం

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।

శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

 



Recent Stories







bpositivetelugu

చదివింది బాగా గుర్తుండాలంటే..

 కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు.  

MORE
bpositivetelugu

నవరాత్రులు.. నవ నైవేద్యాలు

దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన విశేష ఫలాన్నిస్తుంది. ఆరాధనా విధిని అనుసరించి ఈ 9 రోజులూ వివిధ నైవేద్యాలను అమ్మవారికి 

MORE