జగజ్జనని 8వ రూపం మహాగౌరి. నంది వాహనంపైమల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపించే తెల్లని ఆభ‌ర‌ణములు, వ‌స్త్రాలతో ప్రశాంతమైన వదనంతో భక్తులకు దర్శనమిస్తుంది. నాల్గుచేతుల‌లో వ‌ర‌ద‌, అభ‌య ముద్ర‌లు, త్రిశూల‌ము, ఢ‌మ‌రుక‌ముల‌ను ధ‌రించిన మహాగౌరిని ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోగా ప‌ర‌మ‌శివుడు స్వయంగా గంగాజ‌లముతో ఆమెను అభిషేకించాడట. దాంతో ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని పురాణ కథనం.

 మ‌హాగౌరి ధ్యానం, స్మరణ, పూజ, ఉపాసన వల్ల సంచిత పాప‌క‌ర్మ‌ల‌న్నీ న‌శించి, భ‌విష్య‌జ‌న్మ‌ల‌లో కూడా పాప‌ములు ద‌రిచేర‌వు. అసాధారణమైన పనులు సైతం సులభంగా పూర్తవుతాయి. అలౌకిక సిద్ధులు సంప్రాప్తిస్తాయి. సాధ‌కుల మ‌నోవ్య‌పార‌ములు అప‌మార్గ‌ముల నుండి స‌న్మార్గ‌మువైపు మ‌రలుతాయి, స‌ర్వ‌శుభాలు సంప్రాప్తిస్తాయి. ఈ రోజు రవ్వతో చక్రపొంగలి మరియు చక్కర పొంగలిని నైవేద్యంగా అమ్మకు నివేదిస్తారు.

శ్లోకం

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।

మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

రామనామ విశిష్టత

కలియుగంలో భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవన్నామంలో ఒక 

MORE