జ్యోతిష శాస్త్రంలో శనిగ్రహానిది ప్రత్యేకమైనస్థానం. ఈయన సాక్షాత్తూ పరమేశ్వరుని అంశతో జన్మించినవాడు. శక్తి సంపన్నుడైన ఆయన దృష్టి నుండి తప్పించుకోవడం సృష్టిలో ఎవరికీ సాధ్యంకాదు. శని చూసేందుకు క్రూరుడనిపించినా, ఆయన మనసు నవనీతం కంటే మెత్తనిది. సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర గ్రహాలపై శని వేరువేరు రకాల ప్రభావాన్ని చూపిస్తాడు. జన్మరాశికి ముందు 12వ రాశిపైన 2వస్థానంలో శని సంచరించడాన్ని ‘ఏలిన’నాటి శని అంటారు. ఆ సమయంలో శని దశ జరుగుతుండగా జాతకంలో శని పీడ స్థానాలలో ఉంటే బాధిస్తాడు. శని దశ కాలం 19 సంవత్సరాలు కాగాశని మహర్దశలో అంతర్దశ మూడు సంవత్సరాల మూడు రోజులుంటుంది. ఇవి జాతకునికి అత్యంత కష్టదశ. అదే.. శని శుభ స్థానాలలో ఉంటే జాతకుని భోగభాగ్యాలు, అఖండ కీర్తి ప్రతిష్ఠలు ప్రాప్తిస్తాయి.

పరిహారాలు

  • ప్రతి శనివారం, ముఖ్యంగా త్రయోదశి, శనివారంనల్ల నువ్వులతో, నల్లని వస్త్రంతో, నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం
  • శని త్రయోదశినాడు శని స్తోత్రాన్ని,శని నామాలను పారాయణ చేయటం, సుందరకాండ పారాయణం
  • ఇనుప ఉంగరం లేదా మయూర నీలం ఉన్న ఉంగరాన్ని ధరించటం
  • నదీ ప్రవాహంలో బొగ్గులు వదలటం
  • రోజూ ఆవుకు నల్ల చెక్క పెట్టటం లేదా చీమలకు బియపు రవ్వ, పంచదార కలిపి వేయటం, నువ్వుల ఉండలు కాకులకు పెట్టటం, నువ్వుల నూనె చల్లిన రొట్టెలను కుక్కలు ఆహారంగా వేయటం
  • ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షణం చేయటంతో బాటు నల్ల మినుములు, నువ్వులు కలిపిన నీటిని రావి చెట్టుకు పోయటం, ఆరోజు 8,16,24,32,40,48..రూపాయలుశక్తి మేరకు బ్రాహ్మణునికి దానమివ్వటం, వెంకటేశ్వర స్వామి లేదా ఆంజయుని దర్శనం లేదా శివాభిషేకం, నవగ్రహ మండపం వద్ద యాచకులకు అన్నదానం చేయటం, తిరుమలలోతల నీలాలు ఇవ్వటం,Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE