దీపావళిని మనం అనేక సంప్రదాయాల వల్ల జరుపుకుంటాము. పురాణాల ప్రకారం దీన్ని “నరక చతుర్దశి” గా చెబుతారు. పూర్వం నరాకాసురుడనే రాక్షసుడిని కృష్ణుడు ఈ రోజునే వధించాడు గనుక ఏటా ఈ రోజున ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. నిజానికి 'చెడు' అంటే రాక్షసుల రూపంలోనే ఉండాలని లేదు. నిరాశా నిస్పృహలు, వ్యాకుల పడటం, నిరుత్సాహ పడటం వంటి భావనలురాక్షసుల కంటే జీవితానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిని సంహరించేదిశగా ముందడుగు వేయటమే దీపావళి. 

 భారతీయ సంప్రదాయంలో సంవత్సరంలోని 365 రోజులు కూడా పండుగే. ఎందుకంటే పండుగ అనేది జీవితాన్ని ఉత్సాహమైన, ఆనందభరితమైన స్థితికి తీసుకువచ్చే ఒక సాధనం. గతానికి భిన్నంగా ఇప్పుడు ఏడాదిలో వచ్చే 8 లేదా 10 రోజులనే పండుగలుగా చేసుకుంటున్నారు. ఏడాదంతా బాధ్యతల ఒత్తిడిలో నలిగిపోతున్న జనంపండుగ రోజున ఏ మధ్యానానికో నిద్ర లేచి కడుపు పట్టనంత తిని, సినిమాకి వెళ్ళటమో లేక ఇంట్లోనే టీవి చూడటమో చేస్తున్నారు. ఇంతకుముందు పండుగ అంటే ఊరంతా కలిసి ఒక ఉత్సవంగా చేసుకునేవారు. ఈ సంప్రదాయాన్ని తిరిగి జనాలలో తీసుకురావటానికి ఈశా 4 ముఖ్యమైన పండుగలు జరుగుపుకుంటుంది : పొంగల్ లేదా మకర సంక్రాంతి, మహాశివరాత్రి, దసరా ఇంకా గురు పౌర్ణమి. ఇప్పుడు మనం ఇలా చేయకపోతే మన తరువాత తరం వచ్చేసరికి వాళ్ళకి పండుగ అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు కేవలం తినటం,నిద్రపోవటం, వేరే మనిషి గురించి పట్టించుకోనే స్వభావం లేకుండానే వాళ్ళు పెరుగుతారు. భారతీయ సంస్కృతిలో మనల్ని ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉంచటానికే ఎన్నో విధాలుగా ఈ అంశాలను జోడించారు. మన జీవితాన్ని ఒక పండుగలా జీవించాలన్నదే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. మీరు జీవితంలో ప్రతీ దాన్ని ఒక పండుగలా జరుపుకుంటేజీవితంలోని అన్ని విషయలల్లో మీరు పూర్తిగా నిమగ్నం అవుతారు.

దీపావళి ముఖ్య ఉద్దేశం జీవితంలో ఆ పండుగ వాతావరణం తీసుకురావటమే.మీలోకొంచం ఉత్తేజాన్ని కలిగించటానికే ఈ టపాసులు! ఈ ఒక్కరోజు ఆనందించి ఇక దాని గురించి మర్చిపోవటం దీపావళి ఉద్దేశం కాదు. మీరు ఒక తడిచిన తారాజువ్వ అయితే మీకు రోజూ బయటనుంచి నిప్పు కావాలి. లేకపోతే ఇమనం అలా కూర్చుంటే మన ప్రాణ శక్తి, గుండె, మనస్సు, శరీరం ఒక తారాజువ్వలా ఎగిసిపడాలి. 

ప్రేమాశీస్సులతో, 

సద్గురు 

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో)Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE