• HOME
  • భక్తి
  • లోకరక్షకుని పుట్టినరోజే.. క్రిస్మస్

క్రైస్తవుల ప్రధాన పండుగ క్రిస్మస్. మానవాళి పాపాలను తన రక్తంతో కడిగి పునీతులను చేసిన యేసు జన్మించిన శుభదినమిది. ప్రపంచంలో ఎక్కువమంది జరుపుకునే పండుగ కూడా ఇదే. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్ధం. యేసు అనగా గ్రీకుభాషలో రక్షకుడని, క్రీస్తు అనగా హిబ్రూ భాషలో అభిషిక్తుడని అర్థం. ప్రేమ, త్యాగం, విశ్వాసాలకు ఈ పండుగ అసలైన ప్రతీక. 

2000 ఏళ్ళనాడు నాటి రోమా పాలకుడైన ఆగస్టస్ సీజర్ జనాభా లెక్కలకు పూనుకున్నాడు. ఈ క్రమంలో జనమంతా డిసెంబరు 25 లోగా తమ స్వస్థలాలకు తరలి వెళ్లాలని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలోమేరీ, జోసఫ్ అనే పెళ్ళికుదిరిన జంట 'నజరేతు ' పట్టణంలో నివసించేవారు. ఒకనాడు మేరీకి 'గాబ్రియేల్' అనే దేవదూత కనబడి 'దేవుని నిశ్చయం ప్రకారం కన్యవైన నీవు గర్భం ధరించి దేవుని కుమారునికి జన్మనివ్వబోతున్నావు' అని చెప్పాడు.ఆయన చెప్పినట్లే కొన్నాళ్లకుమేరీ గర్భవతి అయింది. ఈ సంగతి తెలిసి జోసెఫ్ ఆమెను పెండ్లాడరాదని, విడిచి పెట్టాలని ఆలోచించగాదేవదూత కలలో కనపడి' దేవుని నిర్ణయం మేరకు గర్భం ధరించిన మేరీని వదిలిపెట్టవద్దు. త్వరలో ఆమెకు పుట్టే దేవుని కుమారుడు మానవాళిని పాపాల నుండి కాపాడతాడ' ని చెబుతాడు. సత్యం తెలుసుకున్న జోసఫ్ మేరీని ప్రేమతో ఆదరిస్తాడు. 

ఇదే సమయంలో వచ్చిన రాజుగారి ఆజ్ఞ ప్రకారం గర్భవతి అయిన మేరీని తీసుకొని జోసఫ్ తన స్వగ్రామం అయినబెత్లేహం బయలుదేరతారు. అతికష్టం మీద బెత్లెహాం చేరేనాటికి వారికి అక్కడవసతి దొరకలేదు. చివరకు జోసెఫ్ వినతి మేరకు ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో వారిని ఉండనిచ్చాడు. అక్కడే మేరీ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె ఆ బిడ్డను పొత్తిళ్ళలో చుట్టి పశువుల తొట్టిలో పడుకోపెట్టింది. సరిగ్గా.. అదే సమయంలో ఆ ఊరి ప్రక్కనున్న పొలాల్లో గొర్రెలకు కాపలాగా ఉన్నవారి ముందు కన్ను చెదిరే కాంతితో ఒక దైవదూత ఆకాశం నుంచి దిగివచ్చాడు. ఆ వెలుగును చూసి భయపడి వారంతా భయపడి పారిపోసాగారు. అప్పుడు దేవదూత వాళ్ళతో ' భయపడకండి. దేవుని ప్రతినిధిగా శుభవార్త తెచ్చాను. ఇప్పుడే బెత్లెహేములోని ఒక పశువులపాకలో లోకరక్షకుడు అవతరించాడు. పశువుల తొట్టిలో పొత్తిళ్ళలో ఉన్న శిశువుని వెళ్లి దర్శించండి' అని చెప్పాడు. ఆ సమయంలోనే ఆకాశం నుండి దిగివచ్చిన దేవదూతలు పొలమంతాదేవునికి స్తుతి గీతాలు పాడి మాయమైనారు. అప్పుడు ఆ గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన విధంగా వెతుకుతూ చివరకుమేరీ, జోసెఫ్ ఉన్న పాకలోని బాలయేసును దర్శించారు. డిసెంబర్ 24 అర్థరాత్రి జరిగిన ఈ ఘటనను మరునాడు క్రిస్మస్ పేరుతో జరుపుకున్నారు. 

 హంగు, ఆర్భాటాలతో క్రీస్తు జన్మదినాన్ని జరుపుకొని సరిపెట్టుకోవటం గాక ఆయన బోధించిన ప్రేమ, త్యాగం, విశ్వాసం అనే లక్షణాలను మనమంతా అలవరచుకొని ఆయన చూపిన మార్గంలో నడివాలి. అప్పుడే అది అసలు సిసలు క్రిస్మస్‌ పండుగ అవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE