• HOME
  • భక్తి
  • పరమపద ప్రాప్తికి ఉత్తరద్వార దర్శనం

సంవత్సరంలో వచ్చే మొత్తం 24 ఏకాదశుల్లో పుష్యమాసంలో వచ్చేశుద్ధ ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈ రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు గనుక దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దీనికి గుర్తుగా భక్తులు ఏకాదశి తెల్లవారు జామున వైష్ణ ఆలయాల్లోఉత్తర ద్వారాన దర్శనమిచ్చే స్వామిని దర్శించుకొని తరిస్తారు. దీన్ని వైకుంఠ ద్వార దర్శనం అంటారు . ఏడాదిలో మిగిలిన ఏకాదశులను పక్కనబెట్టినా, ఈ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, స్వామి నామాన్ని జపించి, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నవారికి 3 కోట్ల ఏకాదశివ్రతాలు చేసిన పుణ్యఫలం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఏ కారణంగా తనువు చాలించినా మళ్ళీ జన్మ ఉండదని కూడా పెద్దలు చెబుతారు.

పురాణ గాథ

 కృతయుగంలో 'ముర' అనే రాక్షసుడి బాధ తట్టుకోలేక దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు. విష్ణువు వాడితో యుద్దానికి తలపడి వాడి సైన్యాన్ని నాశనం చేయగా ఆ రాక్షసుడు సముద్రం అడుగున దాక్కొంటాడు. వాడిని బయటకు రప్పించేందుకు విష్ణువు ఒక గుహలో దాక్కొనగా, ఆ సంగతి తెలిసి ఆ రాక్షసుడు గుహలోకి వెళ్లిపడుకొని ఉన్న విష్ణువుపై కత్తి ఎత్తగా ఆ మరుక్షణంమహాలక్ష్మి దుర్గ రూపంలో మురాసురుణ్ని సంహరించింది. ఆ రోజు విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడనీ , నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరిట అమ్మవారిని ఆరాధిస్తున్నారని ఐతిహ్యం.

ఏకాదశి నియమం

ఏకాదశినాటి ప్రధాన విధి ఉపవాసం. 'ఉప' అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరగా ఉండటమే ఉపవాసం.దీనిలో భాగంగా పూజ, జపం, ధ్యానం వంటి సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఉండగలిగినవారు తులసి తీర్థంతో ఉపవసిస్తారు. రోజంతా నిరాహారులుగా ఉండలేని వారు ఉడికించని ఆహారం.. అంటే పండ్లు, నానబెట్టిన గింజలు, పాలు, నువ్వులు వంటివి తీసుకోవచ్చు. దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసం ఉండి ఏకాదశి ఘడియల్లో విష్ణు ధ్యానం చేసి, తెల్లవారు జామునే ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని ద్వాదశి ఘడియలు వెళ్ళేలోగా పారణ (భోజనం) చేయాలి. ద్వాదశి రోజున అతిథి లేకుండా భుజించకూడదు. శక్తి ఉన్నవారు దానం చేయాలి.

పేరుకు వ్రతంలా కనిపించే ఈ వీధిలో అంతర్లీనంగా గొప్ప తాత్విక భావన దాగిఉంది. దేహాన్ని దేవాలయంగా, అందులోని జీవుడిని పరమాత్మగా గుర్తించటమే ఈ ఉపవాస ప్రధాన లక్ష్యం. మనిషిని మాయలో పడేసే 11 ఇంద్రియాలను ( 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు) కట్టడి చేసి,పూజ, జపం, ధ్యానం మార్గాల్లో రోజంతా మాధవుని ఆరాధించి మనలో ఉన్న ఆయన ఉనికిని గ్రహించి అనుభూతి చెందటమే ఏకాదశి ఉపవాసపు ప్రధాన ఉద్దేశం.

వెలిగిపోయే తెలుగు నేల

ఈ రోజు భక్తులు తెల్లవారు జామునవైష్ణవ ఆలయాలలో స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని తరిస్తారు . భద్రాచలం, తిరుమల , అన్నవరం వంటి క్షేత్రాల్లో గరుడ వాహనంపై స్వామి వారు సపరివారంతో దర్శనమిచ్చే తీరును మాటల్లో వర్ణించలేము.  ఏడాదికోసారి వచ్చే ఈ విశేష పర్వదినాన మనమూ ఆ స్వామిని సేవించి తరిద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE