మాసాల్లో మాఘం ఎంతో ప్రశస్త్యమైనది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమినాడు చంద్రుడు మఘ (మఖ) నక్షత్రంతో కూడిఉంటాడు గనుక దీన్ని మాఘమాసం అంటారు. 'అఘం' అంటే పాపం. 'మా' అంటే లేనిది, తొలగించేది అర్థం. ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వం చేసే ప్రతి పుణ్య స్నానం ఎంతో విశేషమైన ఫలితాన్నిస్తుంది. నారద, పద్మ పురాణాల్లో మాఘ స్నాన ఫలితాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ మాసమంతా పుణ్యస్నానం చేయలేనివారు కనీసం మాఘపౌర్ణమి నాడైనా సముద్ర స్నానం చేస్తే ఆ ఫలితాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. 

    ఈ మాఘ పౌర్ణమినే 'మహామాఘి' అంటారు. ఈ రోజే సతీదేవి దక్షునికి లభించినట్లు పురాణ కథనం. ఏడాదిలో వచ్చే అన్ని పున్నమిల కంటే ఇది అత్యంత ఉత్కృష్టమైనది. సాధారణంగా ఈ రోజున స్నాన జలములో గంగ నిలిచి ఉన్నకారణంగా ఈ రోజు చేసే పుణ్య స్నానం పాపాలను హరించి విష్ణులోక ప్రాప్తి కలిగిస్తుంది. శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైన ఈ రోజున గంగ, త్రివేణీ సంగమాల్లో బ్రహ్మ ముహూర్తం నుంచి సూర్యోదయం లోపు కోట్లాదిమంది పుణ్యస్నానాలు చేస్తారు. ఆ అవకాశం లేనివారు సముద్రం, చెరువు, బావి వద్ద, చివరకు ఇంట్లో నైనా గంగను స్మరించి స్నానం చేస్తే అంతటి పుణ్యఫలాన్ని పొందుతారు. 

    ఈ మహత్తరమైన మహామాఘి రోజున చేసే ప్రతి జప, తప, పూజా, హోమ, దానాదులు అనంత ఫలితాన్నిస్తాయి. ఈ రోజున ప్రదోష సమయంలో శివాలయంలో ఆవుపాలతో అభిషేకం చేసి, నువ్వుల నూనెతో దీపారాధన చేసినవారికి సకల శుభాలు చేకూరతాయి. అమ్మవారికి ఈ రోజున కుంకుమార్చన చేసే మహిళలకు సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. మాఘ నక్షత్రం అధిదేవత బృహస్పతి కాబట్టి ఈ రోజున బృహస్పతిని పూజించాలి. ఈ రోజు చెప్పులు, గొడుగు, వస్త్రాలు దానమివ్వటం వల్ల పలు దోషాలు తొలగిపోతాయి.Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE