దుష్టశిక్షణ కోసం సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే రామచంద్రుని రూపాన భూమ్మీద అవతరించిన రోజు శ్రీరామనవమి. చైత్రశుద్ధ నవమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటివేళ కౌసల్యాపుత్రుడిగా రాముడు అవతరించాడు. నవమి ఆయన జన్మదినం మాత్రమే కాదు. తర్వాతికాలంలో ఆయన కళ్యాణం, రావణ సంహారం తర్వాత పట్టాభిషేకాన్ని పొందినదీ నవమినాడే. సాధారణ మానవుడిగా జన్మించిన రాముడు తన ధర్మాచరణతో భరతజాతికి, ఇంకా చెప్పాలంటే తూర్పు ఆసియా దేశాలకు సైతం ఆరాధ్యుడయ్యాడు. ఆదర్శ నాయకుడు, పితృవాక్య పాలకుడు, గురు భక్తుడు, ఏకపత్నీ వ్రతుడు, మర్యాదా పురుషోత్తముడు, ధర్మ సంరక్షకుడు, సద్గుణవంతుడు, మహా వీరుడు, ప్రేమాస్పదుడు, ఆదర్శ మిత్రుడైన రామచంద్రుని గుణగణాలను మనమూ నిజ జీవితంలో ఆచరణలో పెట్టగలిగినప్పుడు ప్రతి మనిషీ రాముడే అవుతాడు. 

తారక మంత్ర ఫలం

నిజానికి రామనామం రాముని కంటే శక్తివంతమైనది. రామనామం ఎలాంటివాడినైనా భవసాగరాన్ని దాటించగలదు. అందుకు వాల్మీకి మహర్షి జీవితమే ఒక నిదర్శనం. పూర్వం ఒక బోయవాడు అడవిలో దారిదోపిడీలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అతడిని జ్ఞానిఘా మార్చేందుకు ఒకనాడు నారదుడు అతనితో.. రోజూ నీవు చేస్తున్న ఈ దురాగతాల ఫలితంగా మూటగట్టుకుంటున్న పాపం నీ ఒక్కడిదేనా? లేక నీ కుటుంబ సభ్యులూ పాలు పంచుకుంటారా? అని ప్రశ్నించాడు. వెంటనే బోయవాడు ఇంటికి వెళ్లి భార్యాబిడ్డలను నారదుడు అడిగిన ప్రశ్న వేయగా 'ఇంటిపెద్దగా మమ్మల్ని పోషించే బాధ్యత నీదే. నీ పుణ్యంలో భాగం పంచుకొంటామే తప్ప నీ పాపంలో మాకు భాగం వద్ద'ని వారు తేల్చి చెబుతారు. వారి మాటలకు దుఃఖితుడై, వైరాగ్యము చెందిన బోయవాడు మోక్షమార్గానికి ఉపాయము చెప్పమని నారదుని వేడుకొంటాడు. అప్పుడు నారదుడు "రామ రామ రామ" అను తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. శరీరంపై పుట్టలు పెరుగుతున్నా దీక్షతో తారకమంత్రాన్ని జపించిన బోయవాడు చివరికి.. బ్రహ్మ అనుగ్రహముతో జ్ఞానిగా ఆ పుట్ట నుంచి బయటకు వస్తాడు. వల్మీకం (పుట్ట) నుంచి వచ్చిన వాడు గనుక వాల్మీకిగా పేరుపొందారు. ఆ మహనీయుడే తర్వాతి కాలంలో కాదు రమ్యమైన శ్రీమద్రామాయణాన్ని రచించి ధన్యుడయ్యాడు. తారక మంత్రం చేత ఒక బోయవాడే ఇంతటి జ్ఞానిగా మారిన విషయాన్ని గుర్తించి ఈ శ్రీరామనవమి సందర్భంగా మనమూ యధాశక్తి రామనామంతో రమిద్దాం. ఆ శ్రీసీతారామచంద్రమూర్తి అనుగ్రహం పొందుదాం. అప్పుడే మనం జరుపుకొనే శ్రీరామనవమి సందర్భం పరిపూర్ణమవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE