శ్రీరామ నవమి అనగానే తెలుగువారికి ముందుగా గుర్తొచ్చేది.. భద్రాచలంలో జరిగే సీతారామకల్యాణమే. ఆ రోజు పావన గోదావరీ తీరాన వున్న భద్రాచల క్షేత్రం కలియుగ వైకుంఠాన్ని తలపిస్తుంది. వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో భద్రాచల క్షేత్రంలో కన్నుల పండువగా జరిగే ఈ సీతారామ కళ్యాణం త్రేతాయుగంనాటి సీతారాముల కళ్యాణాన్ని తలపిస్తుంది. ముందుగా ఆలయంలోని మూలవిరాట్టుకు వివాహం జరిపించి, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల విగ్రహాలను మిథిలా కళ్యాణమంటపానికి తీసుకువస్తారు. అనంతరం భక్త రామదాసు చేయించిన ఆభరణాలను భక్తులకు చూపి కళ్యాణ మూర్తులకు అలంకరిస్తారు. అనంతరం వేదమంత్రాల మధ్య అభిజిత్ లగ్నంలో జీలకర్ర, బెల్లం సీతారాముల శిరస్సుల పైనుంచి పుట్టింటివారూ, అత్తింటివారూ, భక్త రామదాసు చేయించిన మూడు మంగళసూత్రాలనూ రామయ్యకు తాకించి సీతమ్మకు ధరింపజేయడం భద్రాద్రిక్షేత్ర ఆచారం. భద్రాచల రాముని కళ్యాణానికి నాటి గోల్కొండ ప్రభువు తానీషా ముత్యాల తలంబ్రాలు పంపిన సంప్రదాయాన్ని అనుసరించి నేటికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించడం ఆనవాయితీ. సీతారాముల కళ్యాణం జరిగిన మిథిలా మండపంలోనే నవమి మరుసటి రోజు వైభవంగా శ్రీరామపట్టాభిషేకరం, రథోత్సవం జరుగుతాయి. ఈ శ్రీరామనవమి నాడు మనమూ భద్రాచల రామయ్య కల్యాణాన్ని తిలకించి తరిద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE