• HOME
  • భక్తి
  • పశ్చాత్తాప దినం.. శుభ శుక్రవారం

క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన రోజ్లులో గుడ్‌ఫ్రైడే ఒకటి. ఇది.. మానవులను శాంతిపథాన నడిపేందుకు దేవుని కుమారునిగా భూమ్మీద అవతరించిన ఏసుక్రీస్తు పాపుల కోసం సిలువనెక్కిన రోజు. ఈ రోజు క్రైస్తవులంతా ఉపవాసదీక్ష తీసుకొని రోజంతా ఏసుక్రీస్తు ఆరాధనలో గడుపుతారు. పాపాన్ని ద్వేషించాలిగానీ పాపుల్ని కాదని బోధించిన దయామయుని త్యాగాన్ని కన్నీటితో స్మరించుకొని సంతాపదినం.

చరిత్ర

ఇజ్రాయెల్ లోని నజరేతు పట్టణానికి చెందిన ఏసుక్రీస్తు సత్యం,ప్రేమ, శాంతి, అహింసలను ప్రజలకు బోధిస్తూ వారిలో మార్పుకై ప్రయతించటం నాటి చాందస మతాధికారులకు నచ్చలేదు. ఆయన ప్రజల్ని రెచ్చగొడుతున్నాడనీ, తప్పుదోవ పట్టిస్తున్నాడని భావించిన మతాధికారులు, పాలకులతో కలిసి ఏసును హతమార్చాలని కుట్ర పన్నుతారు. ఇందులో భాగంగా ఆయనను ఏసుక్రీస్తును నిర్భధించి మతాధికారుల సంఘం ముందు హాజరుపరిచి పలు తప్పుడు ఆరోపణలు చేస్తారు. పాలకుడైన రోమన్‌ చక్రవర్తి ఆ ఆరోపణల్ని నమ్మకపోవటంతో మతాధికారులు చక్రవర్తిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తారు. దీంతో ఆయన ఈ ఆరోపణల విషయంలో తీర్పునిచ్చే పనిని మతాధికారులకే వదిలిపెడతాడు . దీంతోవారు ఏసును శిలువ వేయాలని ఆదేశిస్తారు. 

తీర్పును అనుసరించి ఏసు తలపై ముళ్ళ కిరీటం దించి, చెక్కతో చేసిన పెద్ద శిలువను ఆయన భుజాలపై మోపి కొరడాలతో కొట్టుకొంటూ నడిపిస్తారు. వాస్తవాలు తెలియని ప్రజల్లో కొందరు ఆయనను రాళ్ళతో కొడతారు. అంత దయనీయ స్థితిలోనూ తనను శిక్షిస్తున్న వారిని క్షమించమని దయామయుడైన ఏసు దేవుని ప్రార్థిస్తాడు. సిలువమీది ఏసు చేతుల్లో మేకులు దించగా, ఆ సిలువపై రక్తం ఓడుతున్న శరీరంతో ఏసుక్రీస్తు 'నా తండ్రీ ! నా ఆత్మను నీ చేతులలో ఉంచుతున్నాను'అంటూ ఆ శుక్రవారం, మధ్యాహ్నం 3 గంటలకు పాపుల కోసం ఆ శిలువపై ప్రాణత్యాగం చేస్తాడు. నాటినుంచి చర్చిలో శిలువను ఉంచే సంప్రదాయం మొదలైంది. 

ఎలా జరుపుకుంటారు?

క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజున చర్చికి వెళ్ళి రోజంతా ఏసును ప్రార్థిస్తారు. క్రీస్తు జననం మొదలు ప్రాణత్యాగం చేసిన వరకు జరిగిన ఘట్టాలను గుర్తుచేసుకొంటారు. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొయ్యతో చేసిన శిలువను చర్చిలలో ఉంచి ప్రార్థిస్తారు. మరికొన్ని చోట్ల భక్తులు నల్లటి వస్త్రాలు ధరించి క్రీస్తును స్మరిస్తూ సమావేశాలు నిర్వహిస్తారు. సంతాపదినమైన ఈ రోజున చర్చిలో గంటలు మోగించరు. ఈ శుభ శుక్రవారం రోజు మనకోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుడు చూపిన మార్గంలో పయనించేందుకు సంసిద్ధులమవుదాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE