• HOME
  • భక్తి
  • రంజాన్ దాన, ఉపవాసాల విశేషాలు

ఏ పండుగైనా శాంతిని, మానవాళి హితాన్నే ప్రబోధిస్తుంది. రంజాన్ (రమదాన్) పండుగా ఇదేవిషయాన్ని చెబుతోంది. ఇస్లామీయ కేలండర్లో 9వ మాసమైన 'రమదాన్' మాసంలోనే 'దివ్య ఖురాన్' అవిర్భవించింది. ఈ రంజాన్ మాసం ధార్మిక చింతన, క్రమశిక్షణ, దాతృత్వం వంటి ఎన్నో సుగుణాల మేళవింపు. ఈ మాసంలో భక్తితో ఉపవసించిన వారి తప్పులు మన్నించబడతాయనీ, వీరంతా 'రయ్యాన్'గా పిలిచే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేస్తారనీ పవిత్ర ఖురాన్ చెబుతోంది. 

ఉపవాసం

ఖురాన్ సూచించినట్లు ప్రతి మహమ్మదీయుడూ ఈ నెలలో తప్పక ఉపవసించాలి. అయితే వృద్దులు, పిల్లలు, రోగులు, ప్రయాణీకులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఉంది. ఉపవాస దీక్షతో అల్లాహ్ పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఉపవాసీకులు అబద్ధం, పరనింద, కోరికలు లేక సమయమంతా దైవచింతనలో గడపటంతో సహనం, వ్యసనాల పట్ల విముఖత, జాలి, సోదరభావం, భౌతిక అంశాలపట్ల అనాసక్తితో బాటు చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుంది. 

దానం

రమదాన్ నెలలో ఉపవాసానికి ఎంత ప్రాధాన్యం ఉందో దానానికి (జకాత్) అంతే విలువ ఉంది. ముఖ్యంగా సంపన్నులకు జకాత్ తప్పనిసరని దివ్య ఖురాన్ బోధిస్తోంది. ఏడాదిఆదాయంలో కనీసం 2.5% మేరకు ధన, వస్తు రూపంలో నిరుపేదలకు దానంగా ఇవ్వటం ద్వారా బీదలు సైతం పండుగ జరుపుకొనేలా చూడటమే జకాత్ ప్రధాన ఉద్దేశ్యం. జకాత్' తో పాటు ' ఫిత్రా' దానం పేరిట అభాగ్యులకు గోధుమలు లేదా దానికి సమానమైన ధనాన్ని గానీ దానమిస్తారు. ఉపవాస వేళ కలిగే చెడు ఆలోచనలు, పలికిన అసత్యాలు, అనవసరపు మాటల వల్ల కలిగే పాపాన్ని ఈ ఫిత్రా దానం పటాపంచలు చేస్తుందని దివ్య ఖురాన్ చెబుతోంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE