శరన్నవరాత్రి రెండవ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తోంది. శ్రీ చక్రంలో మొదటి దేవత బాల. కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహంకోసం ఉపాసకులు ముందు ఈ తల్లిని ఆరాధిస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం. పరాశక్తి హృదయంలోని దయ, ఇచ్చా, ఙనాది శక్తులే బాల త్రిపుర సుందరి. శ్రీ కృష్ణోపాసనలో బాలకృష్ణుని ఆరధన ఎలాంటిదో, శ్రీ విద్యోపాసనలో బాలా మహా త్రిపుర సుందరి సమర్చన అటువంటిది. 

ఈ అమ్మవారు త్రిగుణైక శక్తియే గాక ఆనందప్రదాయిని. నిర్మలత్వానికి ప్రతీక. మనసు,బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్శమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి, నిత్యసంతోషం కలుగుతుంది. సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల భక్తుల పూజలందుకుంటుంది. ఈ రోజున రెండు నుండి పదేళ్ళలోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా పూజ చేసి, కొత్తబట్టలు పెట్టాలి. ”ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందర్యై నమః” అని నూటెనిమిది సార్లు చదవాలి. అమ్మవారికి పాయస నైవేద్యం పెట్టాలి. సాయంత్రం వేళ లలితా త్రిశతి పారాయణం చెయ్యాలి. 

శ్లోకం

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం

సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం

వందే పుస్తక పాశాంకుశధరామ్ స్రగ్భూషితాముజ్జ్వలాం

తాంగౌరీం త్రిపురాం పరస్పర కళాం శ్రీచక్ర సంచారిణీం //Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE