• HOME
  • భక్తి
  • జ్ఞాన స్వరూపిణి.. శ్రీమహా సరస్వతి 

          శరన్నవరాత్రులలో మూలా నక్షత్రంతో కూడియున్న సప్తమి వేళ  అమ్మవారు శ్రీ సరస్వతిగా పూజలందుకొంటోంది. శక్తి స్వరూపిణి తన అంశంలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరించడమే ఈ అలంకారం ప్రత్యేకత. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి , అంతరిక్ష మహా సరస్వతులనే 7 పేర్లతో విలసిల్లే అమ్మవారు బ్రహ్మ చైతన్య స్వరూపిణి.  ఓ వైపు నెమలి ఉండగా, తెల్లని పద్మం మీద ఆసీనురాలై వీణ , దండ , కమండలం , అక్షమాలను ధరించి ఉంటుంది. కోరికలు మనసుని బాధపెట్టి, దాన్ని జ్ఞానం వైపు వెళ్లకుండా బంధిస్తాయి. ఆ కోరికలను ఛేదించి మనసు బంధనాలను విముక్తం చేసే ఈ తల్లి జీవుల నాలుక చివరన కొలువై ఉంటుంది. 

ఒకప్పుడు సనక సనందనాదులు బ్రహ్మ విద్య బోధించమని బ్రహ్మను కోరతారు. ఆయన వారిని వేచి ఉండమని చెప్పి కొద్దిసేపు ధ్యానం చేసిన పిదప వారికి ఆ విద్యను బోధించేందుకు సిద్ధపడతాడు.అయితే విచిత్రంగా ఆయన ఎంత ప్రయత్నించినా మనసుకు ఏమీ తట్టక , నోటి నుంచి ఒక్క మాటా రాదు.అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై సరస్వతీ మంత్రాన్ని బోధించి జపించమని బ్రహ్మకు చెబుతాడు. ఆ తర్వాతే బ్రహ్మకు ఆలోచన, జ్ఞానము కలిగి బోధ చేయగలిగాడు. 

ఈ రోజున బాసర క్షేత్రంలో కొలువైన శ్రీ ఙ్ఞాన సరస్వతీదేవి సన్నిధిలో విశేష పూజలు, పిల్లలకు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. తెలుపు జ్ఞానానికి ప్రతీక గనుక ఈ రోజు అమ్మవారికి తెల్లని చందనము, తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రములు, శంఖము, ముత్యాల మాలలు వంటివి సమర్పిస్తారు. శక్తి కొలది అర్చించి, షోడశోపచారాలతో అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ గావించి, కొబ్బరి, వడపప్పు, చలిమిడి, అటుకులు, పరమాన్నం, దద్దోజనం నివేదిస్తారు.

శ్లోకం

 'వీణాధరే! విపుల మంగళ దానశీలే!

 భక్తార్తినాశిని! విరించి హరీశ వంద్యే!

కీర్తిప్రదే! అఖిల మనోరదే! మహర్షే!

విద్యాప్రదాయిని! సరస్వతి! నౌమి నిత్యం!

 



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE