• HOME
  • భక్తి
  • అభీష్ట ప్రదాయని.. లలితా పరా భట్టారిక

త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. త్రిమూర్తుల కంటే ముందున్న కారణంగా త్రిపుర సుందరి అని పేరు. ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా ఉన్న ఈమె ఆ తర్వాత పరమ శాంత రూపిణిగా మారింది. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ తల్లి. నవరాత్రి 5వ రోజున పూజలందుకొని లలితాత్రిపుర సుందరి సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. 

ఈ తల్లిని ఆరాధిస్తే దారిద్య్ర దుఃఖాలు తొలగి సకల అభీష్టాలు నెరవేరుతాయి. అమ్మకు కుంకుమార్చన చేసే మహిళలు మాంగల్య సౌభాగ్యాన్ని జీవితాంతం పొందుతారు. ఈ రోజున లలితా అష్టోత్తరం, ''ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని సార్లు జపించాలి.

 



Recent Stories







bpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE