శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు ఈమె ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈమెను ‘ అపరాజితాదేవి’ గా కూడా భక్తులు పూజిస్తారు. ఈమె స్వప్రకాశజ్యోతిస్వరూపిణి. పరమేశ్వరుడి అంకం ఈమెకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది.ఈమె యోగమూర్తి.మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీదేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. దీపారాధనకు 9 ఒత్తుల నువ్వుల దీపాన్ని పెట్టి, ఎర్రని వస్త్రాలు ధరించి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో పూజిస్తారు . ఈ రోజు లలితా సహస్రనామం పారాయణ, రాజరాజేశ్వరి అష్టకం చేసి కుంకుమార్చన, సువాసినీ పూజ చెయ్యాలి. పరమాన్నం, లడ్డూలు నివేదన ఇవ్వాలి. వీలైనవారు శ్రీ చక్రార్చన చేస్తే మంచిది. ఇవేవీ చేయలేని వారు 'శ్రీ మాత్రే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి. 

శ్లోకం

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,

శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

జపమూ యజ్ఞమే

పరమాత్మను చేరేందుకు సాయపడే సులువైన మార్గాల్లో జపం ముఖ్యమైనది. యోగసాధనలోనూ జపం ఒక ముఖ్యాంశంగా ఉంది. జప 

MORE