మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే అందుకు చక్కని ఉదాహరణ. కార్తీకం వర్షాకాలానికి వీడ్కోలు పలికి శీతాకాలానికి ఆహ్వానం పలికే సమయం. ఈ రోజుల్లో మంచుతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని సంధ్యావేళలు, సరికొత్త అనుభూతులనిచ్చేలా కనిపించే వాగు, వంక, చెట్టు, చేమ, పంట పొలాలు కనువిందు చేస్తుంటాయి.శరీరాన్ని చలి వాతావరణానికి తగినట్లు సిద్ధం చేసేందుకే మన పూర్వీకులు ఈ కార్తీక నియమాలను సంప్రదాయంలో భాగంగా చేశారు. ఈ కార్తీక విధులను పాటించడం వల్ల ఆధ్యాత్మికపరమైన ఫలాలతో బాటు చక్కని ఆరోగ్యమూ చేకూరుతుంది.             

  • కార్తీక మాసంలో వేకువనే లేచి చన్నీటి స్నానం చేయడం, ఒంటిపూట భోజనాలు, ఉపవాసాలు, ఘాటైన, మాంసాహారాల స్థానే తాజా కూరగాయలను, పండ్లను ఆహారంగా తీసుకోవడం వంటి నియమాల మూలంగా శారీరక జీవక్రియలు గాడిన పడతాయి. అదే సమయంలో ఏడాదిపొడవున ఉండే కుటుంబ, వృత్తి, వ్యాపారపరమైన మానసిక ఒత్తిడిని దూరం చేసే అంశాలు.
  • కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం, ఉసిరి తినటం మన సంప్రదాయం. ఎందుకంటే ఉసిరి, ఉసిరి ఉపఉత్పత్తులు శరీరంలో అధిక ఉష్ణోగ్రతను తగ్గించి సీజనల్ వ్యాధులు, జీర్ణశయ వ్యాధులు రాకుండా చేస్తాయి. ఉసిరిలోని విటమిన్ సి జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు, నోటి దుర్వాసన, నోటి పూత వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ఉసిరి చెట్టు గాలులు కూడా పర్యావరణాన్ని కాలుష్యరహితం చేయడంతోపాటు, మానసిక రుగ్మతలను దూరంచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
  • కార్తీకమాసంలో వేకువనే నదీస్నానం చేయడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఈ మాసంలో నదులు, చెరువులు, బావుల్లో నీరు తేటపడి సూర్యరశ్మి ప్రసారం వల్ల అపూర్వ తేజస్సు, బలాన్ని తెచ్చుకొంటాయి. ఈ స్నానం మానసిక, శారీరక రుగ్మతల్ని తొలగించి ఆయుషు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
  • ఇక.. మనం వెలిగించే కార్తీక దీపాల వెనకా ఓ ఆరోగ్య ప్రయోజనం ఉంది. ఈ చలిరోజుల్లో క్రిమికీటకాలు బెడద ఎక్కువ. ఈ దీపాల వెలుగు, వేడికి అవన్నీ నశిస్తాయి. అలాగే ఈ దీపాలను చూడటం మూలంగా కళ్ళు ప్రకాశవంతంగా మారుతాయి.
  • ఈ నెలలో పూజకు వాడే చామంతి వంటి పూలు చర్మానికి,శరీరానికి మేలు చేకూరుస్తాయి. వాటి పరిమళంతో మనస్సుకి స్వాంతన చేకూరుస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE