తులసి సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందునా.. సాక్షాత్తూ నారాయణ స్వరూపంగా చెప్పే మార్గశిర మాసంలో ఇంటిలోని తులసి వద్ద నిత్యం దీపం పెట్టటం విశేష ఫలప్రదం. భాగవతంలో సత్యభామ సంపదల కంటే రుక్మిణి భక్తితో సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైన దాన్ని బట్టి నారాయణుడికి తులసి ఎంత ప్రీతికరమో తెలుసుకోవచ్చు. నిద్ర లేవగానే తులసిని దర్శించినచో ముల్లోకములలోని సకల తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభిస్తుందని బ్రహ్మపురాణం పేర్కొంటోంది. తులసి ఇంటిని, వాతావరణాన్ని, మనసునూ పవిత్రం చేస్తుందని పెద్దల విశ్వాసం. 

తులసి పూజ విశేషాలు

తులసికి చేసే ప్రదక్షిణము అశుభాలను తొలగిస్తుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. ముఖ్యంగా తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి వద్ద చేసే దీపారాధన సౌభాగ్యాన్ని ఇవ్వటమే గాక ఇంటిలోకి దుష్టశక్తులు రాకుండా చేస్తుంది.

రోజూ చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి వద్ద నిలబడి ఈ క్రింది శ్లోకాన్ని చదివి నమస్కరించి ఆ నీటిని తులసి మొదట్లో పోసి నమస్కరించాలి. అనంతరం తులసి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి. 

'నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!

నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!

బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!

పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!' 

పవిత్ర తులసి  

 తులసి దళాలను రాత్రివేళ కోయరాదు.  అలాగే మంగళ, శుక్ర, ఆదివారాల్లో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, జనన మరణ శౌచములలో కోయరాదు. ఈ రోజులలో పూజ చేయాల్సి వచ్చినప్పుడు తులసి చెట్టు నుంచి కింద రాలి పడిన దళములతో పూజ చేయాలి. అలా కుదరకపోతే ముందు రోజే కోసిన తులసి దళములను ఉపయోగించవచ్చు. అయితే సాలగ్రామ పూజ చేసేవారు పై నియమపు పాటింపు లేదు. సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం గనుక ఏడాదిపొడవునా ఏ రోజైనా వారు తులసిని కోయచ్చు. స్నానము చేయకుండా, పాదరక్షలు ధరించి తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. మొక్కను కదిలించకుండా రెండేసి ఆకులు కలిగిన దళమును మాత్రమే కోయాలి. పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని నారాయణ ప్రసాదంగా భావించి తినాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE