భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత పరిష్కారం చూపుతోంది. పరమాత్మ తొలిసారి దీన్ని సూర్యునికి బోధించగా , సూర్యుని నుంచిఅయన కుమారుడైన మనువుకు, ఆయనన నుంచి ఇక్ష్వాకు మహారాజుకు గీతాజ్ఞానం చేరినట్లు భగవద్గీత చెబుతోంది. అయితే ఉనికి నశించే క్రమంలో 5 వేల ఏళ్ళ క్రితం మరోమారు పరమాత్మ అర్జునుని ద్వారా అందించాడు. పరమాత్మ దివ్యసందేశమైన భగవద్గీత అత్యంత పురాతన కాలం నుంచి మన సమాజంలో గంగానదిలా ప్రవహిస్తోంది. అసంఖ్యాకమైన పుణ్యాత్ములు ఈ అమృతమయ గీతాజ్ఞానాన్ని స్వీకరించి కృతార్థులై తరించారు. మరెందరో దానిని ప్రపంచవ్యాప్తం చేసిప్రపంచమానవాళినందరినీ ఉద్ధరించారు. ఈ రకంగా గీతాజ్ఞానామృతం మానవసమాజంలో లభించడం మొదలైంది. 

అరుదుగా లభించే మానవ జన్మను కేవలం ఆహారం, నిద్ర, మైథున,రక్షణ లకే పరిమితం చేసే స్థితి నుంచి ఆత్మ సాక్షాత్కారం పొందే దిశగా నడిపించే శక్తి భగవద్గీతకు మాత్రమే ఉంది. ఈ దిశగా అడుగులు వేయకపోతే మానవసమాజం జంతుసమాజంగానే మిగులుతుంది.

 ఎన్నో రకాల బలాలు మనిషి ఉన్నా నిజానికి మనిషికి అవసరమైన అసలైన బలం జ్ఞానమే.జీవిక కోసం కర్మయోగాన్ని సాధన చేసినా అంతిమంగా మనిషిని ముక్తిమార్గానికి చేర్చేది జ్ఞానయోగమే . ఈ జ్ఞానాన్ని జగత్తుకు అందించాడు గనుకే శ్రీకృష్ణుడు మనకు జగద్గురువు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణించేవారు తప్పక ఆయన కృపకు పాత్రులవుతారు. వారే రాబోయే తరాలవారికి మార్గదర్శులుగా నిలుస్తారు. అందుకే ఈ గీతాజ్ఞాన వాహినిలో మనమూ ఓ మునకైనా వేసి తరిద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE