• HOME
  • భక్తి
  • మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

   తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ స్మరణతో చేసే జాగరణ విశేష ఫలాన్నిస్తాయి. ఈ నియమాలతో మనిషి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు అదుపులో ఉంటాయి. ఏడాది పొడవునా నెలకు 2 సార్లు వచ్చే ఏకాదశుల్లో.. పుష్యమాసపు శుక్ల ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనమెక్కి 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణ కథనం. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం చేసుకొంటారు. ఈ రోజున నియమంగా ఏకాదశిని పాటిస్తే 3 కోట్ల ఏకాదశుల ఫలం లభిస్తుందనీ అందుకే దీనినిముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈరోజు మనసును భగవంతుని మీద పెట్టి ప్రార్థించే వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది గనుకే దీన్ని ‘సౌఖ్యద ఏకాదశి’గా,మోక్షప్రాప్తినిస్తుంది గనుక మోక్ష‘ద’ ఏకాదశిగానూ పేరొచ్చింది. వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధిచెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు.

విధులు

 దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి రోజున వేకువనే లేచి స్నానాదులు ముగించి గడపలను పసుపు కుంకుమలతో అలంకరించాలి. తెల్లని దుస్తులు ధరించి యధాశక్తి విష్ణు పూజ చేసుకొని పిదప ఆలయంలోని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి. తిరిగిపూజామందిరంలో విష్ణుపూజ చేసుకోవాలి. విష్ణు పూజకు తామరపువ్వులు, తులసి దళములు, జాబి పూలను వాడాలి. ఈ రోజు పూజలో అయిదేసి వత్తులు వేసిన 2 దీపాలు వెలిగించాలి. పంచహారతికి ఆవునేతిని, దీపారాధనకు కొబ్బరి నూనె వాడాలి. నుదుట తిరునామం ధరించి, ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 మార్లు జపించి అనంతరం దీపారాధన చేయాలి. తులసిమాల ధరించి, తూర్పు వైపు తిరిగి పూజ చేయటం ఉత్తమం. పూజ తర్వాత పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. ఈ రోజున పగలు ఉపవాసం ఉండాలి. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. అసత్యం, స్త్రీ సాంగత్యం, దుష్ట ఆలోచనలు పనికిరావు. రాత్రంతా జాగరణ చేయాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చు. ద్వాదశినాడు తిరిగి పూజచేసి ఎవరైనా అతిథికి భోజనం పెట్టిన తర్వాత గృహస్తులు భోజనం చేయాలి. అనంత పుణ్య ఫలాన్ని అందించే ఈ రోజున ఉపవాస నియమాన్ని పాటిస్తూ మనసును ఆ శ్రీమన్నారాయణుని మీద నిలపటమే మనం చేయాల్సిన పని.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE